Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

భార్యను హత్య చేసి.. నరికి తలతో స్టేషన్‌‌లో లొంగిపోయిన భర్త.. కారణం ఇదే…!

  • భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో కిరాతకం
  • పదునైన ఆయుధంతో శిరచ్ఛేదం.. నరికిన తలతో స్టేషన్‌లో లొంగిపోయిన భర్త
  • ఒడిశాలోని నయాగఢ్ జిల్లాలో వెలుగుచూసిన దారుణ ఘటన

ఒడిశాలోని నయాగఢ్ జిల్లా బిడపాజు గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఓ వ్యక్తి కిరాతక హత్యకు పాల్పడ్డాడు. భార్యకు శిరచ్ఛేదం విధించాడు. నరికిన తలను తీసుకెళ్లి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. శనివారం ఈ ఘటన జరిగిందని, నిందితుడి పేరు బాఘా అని, అతడి వయసు 35 సంవత్సరాలని పోలీసులు వివరించారు. భార్య పేరు ధరిత్రి (30) అని, పదునైన ఆయుధంతో ఈ దారుణానికి ఒడిగట్టాడని వివరించారు. 

ధరిత్రి వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని బాఘా అనుమానించాడని, ఆగ్రహంతో ఆమెపై దాడి చేశాడని పోలీసులు వెల్లడించారు. ఆవేశంతో పదునైన ఆయుధంతో తలను నరికినట్టు తేలిందన్నారు. మొండేన్ని కూడా గర్తించామని, దర్యాప్తు  మొదలుపెట్టామని బనిగొచ్చా పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ లక్ష్మణ్ దండసేన ప్రకటించారు. నిందితుడు బనిగొచ్చా పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడని చెప్పారు. కాగా ఈ హత్య భయాందోళనలకు గురిచేసిందని స్థానికులు తెలిపారు.

Related posts

ప్యాంటుపై పెయింట్.. కస్టమ్స్‌లో కట్ చేస్తే మొత్తం బంగారమే!

Drukpadam

టీ పొడి అనుకుని పిచికారీ మందుతో టీ తయారు చేసిన ఇల్లాలు.. ఐదుగురి మృతి!

Drukpadam

వరద నీటిలో కొట్టుకుపోయిన జగిత్యాల ఎన్టీవీ రిపోర్టర్ జమీర్ !

Drukpadam

Leave a Comment