Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

గ్యారంటీలకు వారంటీ లేదన్నవారికీ చెంపపెట్టుగా రెండు గ్యారంటీల అమలు …మంత్రులు , భట్టి ,తుమ్మల ,పొంగులేటి!

గ్యారంటీలకు వారంటీ లేదన్న వారికీ చెంపపెట్టులా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 24 గంటల్లోనే రెండు గ్యారంటీ పథకాలు అమలు చేశామని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు , వ్యవసాయ ,మార్కెటింగ్ ,చేనేత జౌళి శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు , రెవెన్యూ ,గ్రహనిర్మాణ , సమాచార శాఖామంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు .ఖమ్మం జిల్లానుంచి మొదటిసారిగా ముగ్గురు మంత్రులు రేవంత్ మంత్రివర్గంలో ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మొదటిసారి ఖమ్మం వచ్చిన సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో మీడియా సమావేశంలో వారు మాట్లాడారు …

డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ సంపద సృష్టించి ప్రజలకు పంచడమే ప్రజా ప్రభుత్వం ప్రధానమైన ఏజెండా గా ఉంటుందని ప్రజల కోసమే ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు ….అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే రెండు గ్యారెంటీలు అమలు చేశాం. వంద రోజుల్లో మిగత నాలుగు గ్యారంటీలు అమలు చేస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు …ప్రజా ప్రభుత్వంలో ప్రతి వ్యవస్థ ప్రతి సంస్థ ప్రజల కోసం పనిచేస్తుంది. ఈ పీపుల్స్ ప్రభుత్వాన్ని పూర్తిగా ప్రజలకు అంకితం చేస్తున్నామని అన్నారు .. అసెంబ్లీలో పండుగ వాతావరణం లో ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారెంటీల్లో రెండు గ్యారెంటీలకు శ్రీకారం చుట్టిన విషయాన్నీ గుర్తు చేశారు .మహిళా సాధికారతకు తొలి అడుగుగా రాష్ట్రంలోని మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ ఉచిత ఆర్టీసీ బస్సులను ప్రారంభించామన్నారు ..రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి రాజీవ్ ఆరోగ్యశ్రీ సాయాన్ని పది లక్షల రూపాయలకు పెంచుతూ అందించే గ్యారెంటీని ప్రారంభించామన్నారు ..కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీలకు వారంటీ లేదని ఎద్దేవా చేసిన బిఆర్ఎస్ నాయకులకు చెంపపెట్టు లాగా బాధ్యత తీసుకున్న రెండు రోజుల్లోనే రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఉచిత బస్సు హామీలను అమలు చేశామన్నారు ..

వ్యవసాయ,మార్కెటింగ్ , జౌళి చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ వ్యవసాయరంగం అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు …రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇండ్ల సమస్య, పోడు ల్యాండ్స్, ఇతర సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు ..బహుళార్ధ సాధక ప్రాజెక్టులు, పరిశ్రమలు, ఐటి పరిశ్రమలు, ఏర్పాటు చేయడంతో పాటు సేవారంగాన్ని ప్రోత్సహిస్తామని వివరించారు ..తాడిత పీడిత దళిత గిరిజన బడుగు బలహీన మైనార్టీ వర్గాల ప్రజలకు ఉత్పత్తి రంగాల్లో సృష్టించిన సంపదను పంచుతామన్నారు . అన్ని వర్గాల ప్రజలు ఆత్మగౌరవంతో తలెత్తుకొని జీవించే విధంగా ఇందిరమ్మ రాజ్యం తెస్తామని చెప్పారు ..అందరికీ ఇండ్లు కొలువులు ఇవ్వడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఉంటుందని ప్రజలు మెచ్చేలా ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయని అన్నారు ..గత పాలకులు ఖమ్మం జిల్లాకు గోదావరి నది జలాలు తీసుకురావాలన్న చిత్తశుద్ధి లేకపోవడం వల్ల గోదావరి జలాలు రాలేదు…జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ముగ్గురు మంత్రులం కలిసికట్టుగా పనిచేసి ఖమ్మం జిల్లాకు గోదావరి నది జిల్లాలు తెస్తాం రైతుల కాళ్లు కడుగుతామన్నారు …ప్రజలు నిర్భయంగా ,స్వేచ్ఛగా బ్రతికే జీవితాన్ని గడపడం కోసం ప్రజాపాలన అందిస్తామని భట్టి అన్నారు ..

జర్నలిస్టులకు గతంలో ఇంటి స్థలాలు ఇచ్చాం..కేసీఆర్ ప్రభుత్వం పది సంవత్సరాలుగా జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇచ్చే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించింది…జర్నలిస్టుల ఇండ్ల సమస్య పరిష్కారానికి కోర్టు అనుమతులు ఇచ్చినప్పటికీ బిఆర్ఎస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులు పెట్టింది…ఖమ్మంలో 10 అసెంబ్లీ స్థానాలకు గాను తొమిది స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి గెలిపించిన జిల్లా ప్రజలకు కృతజ్ఞతలు
…ప్రజా ప్రభుత్వం ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీకి అమూల్యమైన ఓట్లు వేసిన ఓటర్లకు ధన్యవాదాలు…

జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ రైతు బంధు పథకం అమలుపై బీఆర్ యస్ నేత మాజీమంత్రి హరీష్ రావు మాటలపై పొంగులేటి ఫైర్ అయ్యారు …రాష్ట్రాన్ని 9 సంవత్సరాలుగా అప్పులకుప్పగా చేసిన దోచుకుతిని మీరా మాట్లాడేది ప్రజలు తిరస్కరించిన బుద్ది రాలేదు …మేము అధికారంలోకి వచ్చి మూడు రోజులు కాలేదు …వంకర బుద్ది తో విమర్శలు చేయడం మానుకోండి ..ప్రజలు గమనిస్తున్నారు …అని ఘాటు గా స్పందించారు …తెలంగాణ ప్రజల సొమ్ము మొత్తం పందికొక్కుల్లా తిన్నారు నువ్వు, నీ మామా అకౌంట్ లోకి వేసుకున్నారుగా….అపుడే ఏముంది …తిన్నదన్న కక్కాల్సిందే అంటూ హరీష్ పై విరుచుకపడ్డారు .
రైతు బంధు పైసలు వేయడానికి నువ్వు తీసుకున్న టైం 3 నెలలు…
గురువింద లాగా ప్రవర్తించకండి….ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి అంటూ హితబోధ చేశారు ..

ఎన్నికల్లో ఇందిరమ్మ రాజ్యం కావాలని మమ్మల్ని గెలిపించారు…ఓటర్లకు శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు…ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది గంటల్లోనే 6 గ్యారెంటీల పై సంతకాలు చేసారు మన ముఖ్యమంత్రి…తూతూ మమ అనుకోకుండా చెప్పిన హామీలను అమలు చేస్తున్నాం…ఆర్ధిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పథకాలు అమలు చేస్తున్నాం…9 ఏళ్లలో అప్పులకుప్పగా చేశారు రాష్ట్రాన్ని..రెండు రోజులు గడవక ముందే మాపై ఆరోపణలుచేస్తున్నారు….అపులకుప్పగా మార్చిన మీరా మాట్లాడేది…

అంతకు ముందు హైదరాబాద్ లోని పొంగులేటి నివాసంలో కలుసుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డిలకు ఖమ్మం సరిహద్దుల్లోని నాయకన్ గూడెం వద్ద ఘనస్వాగతం లభించింది …వేలాది మంది కాంగ్రెస్స్ కార్యకర్తలు వారి అభిమానులు సరిహద్దుల్లోకి చేరుకొని ముగ్గరు మంత్రులను గజమాలతో సత్కరించారు …అక్కడ నుంచి ఓపెన్ టాప్ వాహనంలో ప్రజలకు అభివాదం చేస్తూ వారు నాయకన్ గూడెం , పాలేరు , కూసుమంచి ,జీళ్లచెరువు మీదగా ఖమ్మం చేరుకున్నారు ..నాయకన్ గూడెం బస్టాండ్ సెంటర్లోని జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు‌…ఖమ్మం, వరంగల్ క్రాస్ రోడ్ వద్ద సిపిఐ తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు .. నాయకన్ గూడెం నుంచి ఖమ్మం వరకు పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు ..ఖమ్మం, వరంగల్ క్రాస్ రోడ్ వద్ద పెద్ద ఎత్తున ఘనంగా స్వాగతం పలికిన సిపిఐ తెలుగుదేశం పార్టీ శ్రేణులు…

రాష్ట్రంలోని పేదలందరికీ ఉచితంగా కార్పొరేట్ వైద్యం…

  • రాజీవ్ ఆరోగ్య శ్రీ పోస్టర్ ఆవిష్కరణ లో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొంగులేటి, తుమ్మల రాష్ట్రంలోని పేదలందరికీ ఉచితంగా కార్పొరేట్ వైద్యం తో పాటు అన్ని రాజీవ్ ఆరోగ్యశ్రీ ఏంపానల్డ్ ఆసుపత్రిలో తక్షణమే అమలు చేస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి, పాలేరు ఎమ్మెల్యే పొంగులేటి శ్రీనివాస రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కూసుమంచి మండల కేంద్రంలోని ప్రాథమిక వైద్యశాల నందు రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య సాయం రూ.10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం పోస్టర్ ను ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో రెండు గ్యారెంటీలను అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే అమలు చేశామన్నారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అమలు చేయడం జరిగిందన్నారు. దీనిని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారని పేర్కొన్నారు. అదేవిధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ఐదు లక్షల నుంచి 10 లక్షల వరకు పెంచి అమలు చేయడం జరిగిందని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీల వాగ్దానంలో మిగతా గ్యారెంటీలను రాబోయే రోజుల్లో పూర్తిస్థాయిలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్, సీపీ విష్ణు ఎస్ వారియర్, డీఎంహెచ్వో మాలతి, మండల వైద్యాధికారి కిషోర్, ఎంపిడివో రమాదేవి, తహసీల్దార్ సంపత్ కుమార్, ఎంపివో రామచంద్రరావు, స్థానిక సర్పంచ్ చెన్న మోహన్ రావు, కూసుమంచి ఎంపీటీసీ మాదాసు ఉపేందర్ రావు తదితరులు ఉన్నారు.

Related posts

రుణమాఫీ నేపథ్యంలో రాజీనామా సవాలుపై హరీశ్ రావు కీలక ప్రకటన

Ram Narayana

ఓటే వజ్రాయుధం …ఆలోచించి ఓటు వేయాలి …ఖమ్మం ,కొత్తగూడెం సభలో కేసీఆర్

Ram Narayana

కమ్యూనిస్టుల పోరాట ఫలితమే విలీనం…సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని

Ram Narayana

Leave a Comment