నావృత్తి వ్యవసాయం నాకు ఇదే శాఖ కేటాయించడం సంతోషం :తుమ్మల
ఇది సీఎం ముందు చూపుకు నిదర్శనం
రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది..
అన్నిరకాల పంటలకు తెలంగాణ అనుకూలం
కొత్తపంటలను ,వాణిజ్యపంటలను ప్రోత్సహించాలి
సీజన్ కు ముందుగానే ప్రణాళికలు రూపొందించాలి
వ్యవసాయ శాఖ అధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సమీక్ష
నాది రైతు కుటుంబం , నావృత్తి వ్యవసాయం ఈశాఖను నాకు కేటాయించడం సంతోషం …ఇది సీఎం ముందుచూపుకు నిదర్శనం అని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు …సోమవారం వ్యవసాయశాఖ అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో పాల్గొని అధికారులకు పలు చూచనలు చేశారు …వ్యవసాయ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరవాత మొదటి సమీక్ష నిర్వహించిన తుమ్మల.
సచివాలయంలోని వ్యవసాయ శాఖ సెక్రటరీ ఛాంబర్లో అధికారులతో మంత్రి సమావేశం నిర్వహించారు …సమావేశం సందర్భంగా మంత్రికి సెక్రటరీ రఘునందన్ రావు, హెచ్ఓడీ, ఇతర అధికారులు శుభాకాంక్షలు తెలిపారు ..
వ్యవసాయానికి ఉన్న ప్రాధాన్యతను గుర్తించడం వల్లే సీఎం నాకు ఈ శాఖను కేటాయించారు.అన్ని రకాల పంటలకు తెలంగాణా నేల అనుకూలంగా ఉంటుంది. బహుశా దేశంలో ఏ రాష్ట్రానికి ఈ ప్రత్యేకత లేదుని అందుకు అనుగుణంగా రైతులను ఎడ్యుకేట్ చేయాలనీ అధికారులను కోరారు ..సీజన్ల వారిగా ముందుగానే శాఖల వారీగా ప్రణాళికలు సిద్ధం చేసుకొని, అందుకు తగ్గట్టుగా రైతులను వ్యవసాయానికి సమాయత్తం చేయాలి – అధికారులకు మంత్రి తుమ్మల సూచన చేశారు ..అధికారులు అందరూ సమన్వయంతో పని చేసి ఉత్పత్తి పెంచి వ్యవసాయశాఖకు మంచి పేరు తేవాలన్నారు .
వ్యవస్థలో, శాఖాపరంగా ఉన్న లోపాలను సవరించుకొని రైతులకు సంక్షేమానికి అధికారగణం పాటుపడాలని కోరారు .మంచి పద్దతులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని అధిక పంట దిగుబడిని సాధించడమే కాకుండా, ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం విశేషంగా కృషి చేయాలన్నారు …తద్వారా రైతులకు మంచి మద్దతు ధర లభించేలా మార్కెటింగ్ శాఖా అధికారులు కృషి చేయాలన్నారు …
రాష్ట్రవ్యాప్తంగా కొత్తరకం పంటలను రైతులకు పరిచయం చేయాలి. వాణిజ్య పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించి, ఆ పంటలను పండిచేందుకు వాళ్లను మానసికంగా సంసిద్ధం చేయాలన్నారు .మామిడి, జామ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసి ఆ పంటల సాగుకు సహాయపడాలన్నారు …పాం ఆయిల్ పంట సాగు చేసే రైతులు మంచి దిగుబడి సాధిస్తున్నారు. వాళ్లకు మంచి గిట్టుబాటు ధర లభిస్తోంది. ఆ సాగును మరింత ప్రోత్సహించాలి. అందులో అంతర పంటగా పుచ్చకాయలు పండించే విధంగా ప్రోత్సహించాలన్నారు …రైతు బాగు పడితే మిగిలిన అన్ని రంగాలు బాగు పడతాయి. రాష్ట్రం సుభిక్షంగా ఉంటందని తుమ్మల అన్నారు ….