Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

తెలంగాణ అసెంబ్లీ …స్పీకర్ ఎన్నిక కాంగ్రెస్ నుంచి గడ్డ ప్రసాద్

తెలంగాణ శాసనసభ స్పీకర్ ఎన్నిక కోసం నోటిఫికేషన్ విడుదలైంది. సోమవారం ఉదయం అసెంబ్లీ సెక్రటేరి యట్ స్పీకర్ ఎన్నిక నోటిఫి కేసన్ కు ఉత్తర్వులు జారీ చేసింది.

డిసెంబర్ 13వ తేదీ ఉదయం 10.30 నుండి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్‌ వేసేందుకు గడువు ఇచ్చింది. ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నాయ కుడు గడ్డం ప్రసాద్ కుమర్‌ ను,శాసన సభ స్పీకర్‌గా కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసిన విషయం తెలిసిందే.

ఆయన ఒక్కరే నామినేషన్ వేయనున్నట్లు తెలుస్తోంది. అనంతరం ఏకగ్రీవంగా గడ్డం ప్రసాద్ ను స్పీకర్ గా ఎన్నుకోనున్నారు. కిరణ్ కమార్ రెడ్డి మంత్రి వర్గంలో గడ్డం ప్రసాద్ టైక్స్‌టైల్ మంత్రిగా పని చేశారు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గడ్డం ప్రసాద్ వికారాబాద్ నుంచి ఎంఎ ల్‌ఎగా గెలుపొందారు…. గడ్డం ప్రసాద్ ఒక్కరే నామినేషన్ వేసే అవకాశం ఉండటంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవం కానున్నది ….119 మంది సభ్యులు ఉన్న తెలంగాణ రాష్ట్ర శాసనసభలో కాంగ్రెస్ 64 సీట్లు గెలుచుకోగా , దాని మిత్రపక్షం సిపిఐకి ఒక సీటు వచ్చింది …దీంతో కాంగ్రెస్ కు క్లియర్ కట్ మెజార్టీ ఉంది ..బీఆర్ యస్ కు 39 ,బీజేపీకి 8 , మజ్లీస్ పార్టీకి 7 సీట్ల ఉన్నాయి…దీంతో కాంగ్రెస్ అభ్యర్థి స్పీకర్ గా ఎన్నిక కావడం లాంఛనమే అవుతుంది….

Related posts

అసెంబ్లీలో రాజగోపాల్ రెడ్డి, హరీశ్ రావు మధ్య మాటల యుద్ధం

Ram Narayana

ప్రజల సెంటిమెంట్‌ను కేసీఆర్ తన ఆర్థిక దోపిడీకి ఉపయోగించుకున్నారు: రేవంత్ రెడ్డి

Ram Narayana

 62,641 కోట్ల నష్టంలో డిస్కంలు.. అసెంబ్లీలో భట్టి విక్రమార్క వెల్లడి

Ram Narayana

Leave a Comment