Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ రాజకీయ వార్తలు

వచ్చే ఎన్నికల్లోనూ ఎన్డీయే కూటమిదే హవా… టైమ్స్ నౌ సర్వేలో ఆసక్తికర అంశాలు

  • టైమ్స్ నౌ-ఈటీజీ సర్వే నివేదిక వెల్లడి
  • బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమికి 323 సీట్లు
  • బీజేపీ ఒక్కటే 300కి పైగా సీట్లు గెలిచే అవకాశముందన్న సర్వే
  • కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమికి 163 స్థానాలు

ఇటీవల ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో విజయం సాధించిన బీజేపీ… వచ్చే లోక్ సభ ఎన్నికల్లోనూ జయభేరి మోగిస్తుందని టైమ్స్ నౌ-ఈటీజీ తాజా సర్వే చెబుతోంది. 

2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమి విజయం సాధించి మళ్లీ చారిత్రక రీతిలో వరుసగా మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఈ సర్వేలో పేర్కొన్నారు. 

లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ నాయకత్వంలోని ఎన్టీయే కూటమి 323 స్థానాలు గెలుచుకుంటుందని టైమ్స్ నౌ-ఈటీజీ సర్వే అంచనాలు వెలువరించింది. కూటమితో పని లేకుండా బీజేపీ ఒక్కటే పోటీ చేస్తే 308 నుంచి 328 వరకు స్థానాలు వచ్చే అవకాశముందని సర్వే వివరించింది. 

అదే సమయంలో, కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమికి 163 స్థానాల వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయట. కాంగ్రెస్ ఒక్కటే పోటీ చేస్తే 52 నుంచి 72 సీట్లకు మించి రావని టైమ్స్ నౌ-ఓటీజీ సర్వే వెల్లడించింది. 

అయితే, 2019 ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి 353 స్థానాలు దక్కగా, ఈసారి ఆ సంఖ్య కాస్త తగ్గనుందని పేర్కొంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 52 ఎంపీ స్థానాలు దక్కడం తెలిసిందే.

Related posts

అమేథీలో తన తండ్రికి ఉన్న ప్రేమబంధాన్ని తానే సాక్షిని …రాహుల్ గాంధీ

Ram Narayana

భారత్ జోడో యాత్రలో రాహుల్ కు డూప్ ను ఉపయోగిస్తున్నారు: అసోం సీఎం సంచలన ఆరోపణలు

Ram Narayana

ముందు మీ అవినీతి చూసుకోండని కేసీఆర్ పై మధ్యప్రదేశ్ సీఎం చౌవాన్ ఫైర్ …

Ram Narayana

Leave a Comment