Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

తెలంగాణ శాసనసభలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ …తమకు అవకాశం ఇవ్వాలన్న బీఆర్ యస్

తెలంగాణ రాష్ట్ర శాసనసభకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో అధికార బీఆర్ యస్ పార్టీ ఓటమి పాలైంది …కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది …బీఆర్ యస్ హయాంలో జరిగిన వాటిపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వాలని అధికార పార్టీ నిర్ణయించింది …శాఖలవారీగా శ్వేతపత్రం కూడా విడుదల చేస్తామని కూడా అధికార కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది…దీంతో బీఆర్ యస్ పార్టీ ఎలాంటి ప్రకట చేస్తారో చూడకుండా అధికార పార్టీకి అవకాశం ఇస్తే తమకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ కు అవకాశం ఇవ్వాలని మాజీ మంత్రి బీఆర్ యస్ ఎమ్మెల్యే హరీష్ రావు స్పీకర్ కు లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది …గతంలో ప్రతిపక్షాలను సభలో లేకుండా చేయడమే కాకుండా సభ్యులను కొనుగోళ్లు చేసి వారిని బలహీన పరిచి సభను తమ ఇష్టా రాజ్యాంగ నడుపుకున్న విషయాన్నీ కాంగ్రెస్ నేతలు గుర్తు చేస్తున్నారు ..అంతే కాకుండా సభలో కాంగ్రెస్ ,బీజేపీ పక్షాల వాదనలు వినకుండా మాటిమాటికి అడ్డుపడ్డ వైనం మర్చి పోయారని అంటున్నారు ..కింద పడ్డ తమదే పైచేయి లాగా ,ఇంకా తమదే అధికారం అన్నట్లుగా బీఆర్ యస్ వ్యవహార శైలి ఉందని రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు …కింద పడ్డ తమదే పై చేయి అనడం బీఆర్ యస్ నేతలకే చెల్లుతుందని అన్నారు …తమ అధికారంలోకి వచ్చిన పథకాలు ,ఆరు గ్యారంటీల అమలుపై వారు ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు …

గౌరవ సభాపతి గారికి,
తెలంగాణ శాసనసభ,
హైదరాబాద్.

ఆర్యా!

విషయము: శాసనసభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయుటకు భారత రాష్ట్ర సమితి పార్టీకి అనుమతి మంజూరు చేయుటకు వినతి.

రేపటి నుంచి జరిగే శాసనసభ సమావేశాలలో ఆర్థిక, సాగునీటి మరియు విద్యుత్ అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు సమాచారం ఉంది. ఒక వేళ ప్రభుత్వానికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు అనుమతించినట్లైతే, దీనికి సంబంధించి ప్రధాన ప్రతిపక్షంగా ప్రజలకు సభ ద్వారా మా వెర్షన్ చెప్పవలసి ఉంటుంది. మేము కూడా ప్రజెంటేషన్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం.

కావున దయచేసి మా భారత రాష్ట్ర సమితి శాసనసభా పక్షానికి కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు అనుమతి ఇవ్వగలరని మనవి.

ఇట్లు
తన్నీరు హరీష్ రావు
శాసనసభ్యులు
భారత రాష్ట్ర సమితి పార్టీ.

Related posts

లగచర్ల రైతులకు సంఘీభావంగా.. చేతుల‌కు బేడీల‌తో అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు!

Ram Narayana

తెలంగాణ అసెంబ్లీ వ‌ద్ద ఉద్రిక్త‌త‌.. పోలీసుల అదుపులో కేటీఆర్‌, హ‌రీశ్‌రావు

Ram Narayana

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా…!

Ram Narayana

Leave a Comment