Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా…!

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేశారు. ఈ నెల 9వ తేదీన అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సెలవులు పోనూ సమావేశాలు ఆరు రోజుల పాటు సాగాయి. అసెంబ్లీ సమావేశాలు మొత్తం ఆరు రోజులు… 26 గంటల 33 నిమిషాల పాటు జరిగాయి. అసెంబ్లీలో పంతొమ్మిది మంది సభ్యులు ప్రసంగాలు చేశారు. ఈ స‌భ‌లో రెండు అంశాల‌పై స్వ‌ల్ప‌కాలిక చ‌ర్చ‌లు జ‌రిగాయి. డిసెంబ‌ర్ 21వ తేదీన నాటికి స‌భ‌లో కాంగ్రెస్‌కు 64, బీఆర్ఎస్‌కు 39, బీజేపీకి 8, మజ్లిస్ పార్టీకి 7, సీపీఐ త‌ర‌పున ఒక ఎమ్మెల్యే ఉన్న‌ట్లు స్పీక‌ర్ ప్ర‌క‌టించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత నిర్వ‌హించిన తొలి శాస‌న‌స‌భ స‌మావేశం ఇది కావడం విశేషం…

అసెంబ్లీ సమావేశాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యహరించింది …గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు , ఆర్థిక అరాచకత్వంపై ప్రధానంగా ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ ఆ డైరక్షన్ లోనే సభను నడిపింది …సీఎం రేవంత్ రెడ్డి తనదైన ముద్ర వేసే ప్రయత్నం చేశారు …డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆర్ధిక , విద్యుత్ శాఖల మంత్రిగా బీఆర్ యస్ ప్రభుత్వం చేసిన అవకతవకలు అప్పులు , సంపాదనను దోచుకోవడంపై పెట్టిన రెండు శ్వేత పత్రాలు సభలో చర్చకు వచ్చాయి …. సవాళ్లు ,ప్రతిసవాళ్ళతో సభ అట్టుడికింది …కొత్తగా ఎన్నికైన 50 మంది సభ్యులు సభలో తమ వాణిని వినిపించే ప్రయత్నం చేశారు …అయితే అందరికి అవకాశం దొరకలేదు …సభలో సీఎం తోపాటు మంత్రులు భట్టి , శ్రీధర్ బాబు ,ఉత్తమ్ కుమార్ రెడ్డి , పొన్నం ప్రభాకర్ , కోమటి రెడ్డి వెంకటరెడ్డి , కొండా సురేఖ , జూపల్లి కృష్ణారావు , సందర్బోచితంగా ప్రతిపక్షాలపై ఎదురు దాడి చేయడం సభను రక్తి కట్టించింది …

ప్రతిపక్షాల నుంచి కేటీఆర్ , హరీష్ రావు , కడియం శ్రీహరి ,పోచారం శ్రీనివాస్ రెడ్డి (బీఆర్ యస్ ) మహేశ్వర్ రెడ్డి , పాటిల్( బీజేపీ ) అక్బరుద్దీన్ ఒవైసీ , (ఎంఐఎం ) కూనంనేని సాంబశివరావు (సిపిఐ )లు చర్చల్లో పాల్గొన్నారు …

Related posts

తెలంగాణ అసెంబ్లీ …స్పీకర్ ఎన్నిక కాంగ్రెస్ నుంచి గడ్డ ప్రసాద్

Ram Narayana

నాడు కాంగ్రెస్ నుంచి పీజేఆర్ తప్ప ఎవరూ మాట్లాడలేదు: సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు కౌంటర్

Ram Narayana

పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి స్పందన

Ram Narayana

Leave a Comment