Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అంతర్జాతీయం

అమెరికాలో హిందూ దేవాలయం గోడలపై ఖలిస్థానీ అనుకూల రాతలు

  • ప్రధాని మోదీపై కూడా విద్వేషపూరిత రాతలు
  • ఘటన తాలూకు ఫొటోలను నెట్టింట పంచుకున్న హిందూ అమెరికన్ ఫౌండేషన్
  • ఈ ఘటనను విద్వేషపూరిత నేరంగా పరిగణించి దర్యాప్తు చేయాలని పోలీసులకు విజ్ఞప్తి
Hindu temple defaced with pro Khalistani slogans in US

అమెరికాలో సిక్కు వేర్పాటువాదులు మరోసారి రెచ్చిపోయారు. కాలిఫోర్నియాలోని స్వామి నారాయణ్ మందిర్ వసాన సంస్థ గోడలపై ఖలిస్థానీ అనుకూల రాతలు రాశారు. ప్రధాని మోదీపై విద్వేష పూరిత రాతలు కూడా రాసుకొచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన చిత్రాలను హిందూ అమెరికా ఫౌండేషన్ ‘ఎక్స్’ వేదికగా పంచుకుంది. నెవార్క్ పోలీస్ డిపార్ట్‌మెంట్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్, సివిల్ రైట్స్ డివిజన్‌‌కు ఫిర్యాదు అందినట్టు కూడా వెల్లడించింది. ఈ ఘటనను ద్వేషపూరిత నేరంగా పరిగణించి దర్యాప్తు చేయాలని పోలీసులకు విజ్ఞప్తి చేసింది. 

కాగా, గతంలోనూ అమెరికాతో పాటూ పొరుగున ఉన్న కెనడాలో హిందూ వ్యతిరేక ఘటనలు వెలుగు చూశాయి. కెనడాలోని సర్రీ నగరంలో ఇటీవల ఓ దేవాలయం గోడలపై ఆగంతుకులు విద్వేషపూరిత రాతలు రాశారు. ఖలిస్థానీ వేర్పాటు వాది నిజ్జర్ హత్యకు సంబంధించిన నిరసనల ఫొటోలను గుడి తలుపులపై అతికించారు.

Related posts

ఆసియా క్రీడల ప్రస్థానాన్ని ఘనంగా ముగించిన భారత్

Ram Narayana

అమోరికాలో కాల్పుల కలకలం.. ఇద్దరి మృతి, 19 మందికి గాయాలు

Ram Narayana

కమలా హారిస్‌కు మద్దతుగా ఏఆర్ రెహ్మాన్ ప్రచారం..

Ram Narayana

Leave a Comment