ఆరోగ్యం

పెరుగుతున్న కరోనా … నెలలో 51 శాతం పెరిగిందన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ

  • ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ విజృంభిస్తున్న కరోనా
  • నెల రోజుల వ్యవధిలో 8.50 లక్షల కేసుల నమోదు
  •  ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 70 లక్షల మంది మృతి
Corona Virus increasing world wide

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసురుతోంది. నెల రోజుల కాలంలో కేసుల సంఖ్య 52 శాతం పెరిగిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. గత నెల రోజుల వ్యవధిలో ప్రపంచ వ్యాప్తంగా 8.50 లక్షల కేసులు నమోదయ్యాయని వెల్లడించింది. వీరిలో 1.18 లక్షల మంది ఆసుపత్రుల్లో చేరారని తెలిపింది. 3 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని చెప్పింది. మరో 1,600 మందికి పైగా ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలిపింది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా కరోనా సోకిన వారి సంఖ్య 77 కోట్లు దాటగా… 70 లక్షల మంది మరణించారని తెలిపింది. బహిరంగ ప్రదేశాలకు వెళ్లేటప్పుడు మాస్కులు ధరించాలని, భౌతికదూరం పాటించేందుకు యత్నించాలని చెప్పింది.

Related posts

ఆ విషయం తెలియని వాళ్లు నాకు క్యాన్సర్ అని రాశారు: చిరంజీవి

Ram Narayana

ఆహారం ఫుల్లుగా తిన్నా బరువు పెరగకూడదనుకుంటే ఈ 5 డ్రింక్స్ తాగితే చాలు !

Ram Narayana

ఈ లక్షణాలు కనిపిస్తే…మధుమేహం ముసురుకుంటున్నట్టే!

Ram Narayana