కాటా అయిన వరి ధాన్యాన్ని వెంటనే తరలించాలి ….
ఎమ్మెల్యే చొరవ చేసి లారీలు రప్పించాలి ….
… భూక్యా వీరభద్రం విజ్ఞప్తి
పెద్దగోపతి లో కల్లలో ఉన్న వరి ధాన్యాన్ని పరిశీలించిన సిపిఎం నేతలు …
కొణిజర్ల:-31-5-2021
గత నెల రోజుల నుంచి వరి పండించిన రైతులు పడిగాపులు కాస్తూ తీవ్ర ఇబ్బందులు గురవుతూ ఆందోళన చెందుతున్న రైతులను సిపిఎం బృందం మండల పరిధిలో పెద్ద గోపతి వరి ధాన్యం కల్లలో పరిశీలించి రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వైరా అసెంబ్లీ ఇంచార్జ్ భూక్యా వీరభద్రం స్థానిక మండల తాసిల్దార్ డిప్యూటీ తాసిల్దార్ లతో ఫోన్లో మాట్లాడి వెంటనే లారీలు పంపించి రైతుల ధాన్యాన్ని తరలించాలని తెలియపరిచారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కష్టపడి పండించిన పంటను కండ్ల ముందు అకాల వర్షాలతో తడిసి మొలకెత్తుంటే ప్రభుత్వాలు పట్టించుకోవా ప్రజా ప్రతినిధులు ఏం చేస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేసినట్లు ఆయన తెలిపారు స్థానిక వైరా శాసనసభ్యులు చొరవ చేసి లారీల సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు అధికారులు ప్రజా ప్రతినిధులు స్పందించకపోతే రైతులతో కలిసి ఆందోళన చేస్తామని ఆయన తెలిపారు
ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు
ప్రతాపనేని లక్ష్మయ్య అన్నవరపు వెంకటేశ్వర్లు జొన్న బోయిన అంజయ్య దండు కృష్ణ ఆడప పుల్లారావు ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా నాయకులు స్వర్ణ సుబ్బారావు రమణారెడ్డి ఖాదర్ సాబ్ తదితరులు పాల్గొన్నారు
వైరా ఎమ్మెల్యే రాములు నాయక్
వైరా నియోజకవర్గం లోని మండలాలలో కొనుగోలు కేంద్రాలలో ఉన్నటువంటి వరి ధాన్యాన్ని త్వరితగతిన మిల్లులకు తరలించాలని అలాగే లారీల కొరత లేకుండా చూడాలని ఖమ్మం అదనపు కలెక్టర్ మధుసూదన్ ను కలసిన వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ రాష్ట్ర మార్క్ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్ ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీసర్ రాజేందర్ వైరా మార్కెట్ చైర్మన్ గుమ్మా రోశయ్య జడ్పి కోఆప్షన్ సభ్యులు ఎస్కే లాల్ మొహమ్మద్ పాల్గొన్నారు
షర్మిల పిలుపుకు స్పందించి కరోనా భాదితులకు అండగా …..
ఐదవ రోజు కరోనా వ్యాధిగ్రస్తులకపీడితుల కు వాలంటీర్లకు బిచ్చగాళ్లకు పేదవారికి కి వైయస్సార్ తెలంగాణ షర్మిల మ్మ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర నాయకులు మరియు భరత్ విద్యాసంస్థల అధినేత శీలం వెంకట రెడ్డి గారు మరియు జిల్లా నాయకులు ఎస్ నాగేశ్వరరావు గారి పర్యవేక్షణలో నియోజకవర్గ నాయకులు దేవంభట్ల శ్రీనివాస శాస్త్రి యూత్ నాయకులు కొప్పుల భరత్ ఆధ్వర్యంలో వైయస్సార్ తెలంగాణ షర్మిలమ్మ పార్టీ మడిపల్లి గ్రామ శాఖ మరియు గ్రామ వాలంటీర్ల సహకారంతో కరోనా వ్యాధిగ్రస్తులకు పేదలకు బిచ్చగాళ్లకు వేడి వేడి ఆహార పదార్థాలు మడిపల్లి మరియు మధిర లో పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో వైయస్సార్ తెలంగాణ షర్మిలమ్మ పార్టీ రాష్ట్ర నాయకులు శీలం వెంకట రెడ్డి గారు మరియు ఖమ్మం జిల్లా నాయకు లు యస్ నాగేశ్వరావు గారు మధిర నియోజకవర్గ నాయకులు దేవంభట్ల శ్రీనివాస శాస్త్రి యూత్ నాయకులు కొప్పుల భరత్ రెడ్డి మహిళా నాయకురాలు కొప్పుల విజయ మధిర మండల నాయకులు చింతల నాగ వేణు చింతల వెంకటేశ్వర్లు కే బాలకృష్ణ రెడ్డి ఇ విజయ్ మడిపల్లి గ్రామ వాలంటీర్లు బజ్జీల శీను సిరి వేరు గోపి పి నీలం పుల్లారావు తదితరులు పాల్గొన్నారు
సిపిఐ ఎం ఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వరంలో ……
ఖమ్మం నగరంలోని రవన్న ట్రస్ట్ నిత్య అన్నదాన కార్యక్రమంనకు 10 వేల రూపాయల విలువ చేసే నిత్యావసర సరుకుల వితరణ..
రాయల సుభాష్ చంద్ర బోస్ మెమోరియల్ ట్రస్ట్, జార్జిరెడ్డి హెల్పింగ్ హాండ్స్ ఆధ్వర్యంలో గత నెల మే 12 నుంచి కోవిడ్ బాధితులకు ఇంటి వద్దకు మరియు కొన్ని ఆసుపత్రులకు వెళ్లి PDSU, PYL, IFTU వాలంటీర్ల ద్వారా ప్రతి రోజు మధ్యాహ్నం, సాయంత్రం రెండు పూటలా 250 మందికి నిత్య అన్నదాన కార్యక్రమం క్రింద ఉచితంగా భోజన సదుపాయం సేవలు అందించడం జరుగుతుంది. దీనిలో భాగంగా కొంతమంది దాతలను ట్రస్ట్ కు మద్దతు ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి చేయడం జరిగింది. దానిలో భాగంగా సహృదయంతో స్పందించి ఈ రోజు శ్రీరామా దాల్ మిల్ పుల్లఖండం వంశీ, పెనుగొండ ఉమాశంకర్ గార్లు 50 kg ల కందిపప్పు మరియు తాటికొండ కృష్ణ పల్లీ మిల్ తాటికొండ కృష్ణ గారు 25 kg ల పల్లీలు మరియు శ్రీనివాస దాల్ మిల్ జల్లేపల్లి శ్రీరామ్ గారు 20 kg ల పెసరపప్పు మొత్తంగా ₹10,000/- రూపాయల విలువ చేసే ప్రొవిజన్స్ ను రామ నరసయ్య విజ్ఞాన కేంద్రంలో న్యూ డెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు, ట్రస్ట్ బాధ్యులు నరేందర్ గార్లకు అందించడం జరిగింది.
ఈ సందర్భంగా దాతలందరికి రాయల సుభాష్ చంద్రబోస్ ట్రస్ట్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ట్రస్ట్ సేవలను మరింత మంది బడుగు, బలహీన వర్గాలవారికి విస్తరింపజేసే అవకాశం కల్పించి నందుకు వారిని అభినందించారు. భవిష్యత్ లో కూడా వారి సహకారం ఎల్లవేళలా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ బాద్యులు ఆవుల వెంకటేశ్వర్లు, పుల్లయ్య, రామయ్య, ఆళ్ల రామారావు,అశోక్ ,ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు.
పాస్టర్లకునిత్యావసర సరుకులు పంపిణి చేసిన జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల
ఖమ్మం జిల్లా పాస్టర్లకు బియ్యం నిత్యావసర సరుకులు కూరగాయలు పంపిణీ చేసిన జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు
ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని 15 డివిజన్ నందు అల్లిపురం రోడ్డులో గల దైవ కృప మినిస్ట్రీస్ వృద్ధాశ్రమం నందు ఖమ్మం జిల్లా పాస్టర్ ఫెలోషిప్ అధ్యక్షులు వేముల సత్యం గారు, పాస్టర్ వనపర్ల ప్రసాద్ రావు గార్ల ఆధ్వర్యంలో ఖమ్మం టౌన్ చింతకాని, బొనకల్,కొనిజర్ల, రఘునాధపాలెం లలో గల 75 మంది పేద పాస్టర్లకు 10 Kg బియ్యం,నిత్యవసర సరుకులు,కూరగాయలు జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు గారి చేతుల మీదగా పంపిణీ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమం లో డీసీసీబీ డైరక్టర్ వేముల శ్రీనివాసరావు, 15 వ డివిజన్ కార్పొరేటర్ రావూరి. కరుణ-సైదుబాబు, మరియు పాస్టర్ లు పాల్గోన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ మధిర కాంగ్రెస్ కమిటీ విజ్నప్తి ….
, ఖమ్మం జిల్లా మధిర మండల , మరియు పట్టణ కాంగ్రెస్ కమిటీ వ్రాయు విన్నపము . విషయము : – మధిర మునిసిపాలిటి మరియు మధిర నియోజకవర్గంలో ఉన్న ప్రభుత్వ హాస్పటల్ లో ఉన్న సమస్యల గురించి , అయ్యా ! మధిర నియోజకవర్గ కేంద్రంలో ఉన్న మధిర సి హెచ్ సి హాస్పటల్ మరియు నియోజకవర్గంలో ఉన్న , అన్ని ఏ హెచ్ సి లో డాక్టర్లు మరియు సిబ్బంది తగినంత మంది లేక పోవడం వలన ప్రజలకు సరైన వైద్య సౌకర్యాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు . అత్యవసర పరిస్థితులలో సరైన సమయంలో వైద్య సౌకర్యం అందక ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి లు కూడా ఉన్నవి . కావున మధిర సి హెచ్ సి , మరియు నియోజకవర్గం పరిధిలోగల అన్ని పీ హెచ్ సిలలో వైద్యులు మరియు వైద్య సహాయక సిబ్బంది మరియు ఫోర్త్ క్లాస్ ఎంప్లాయిస్ పోస్టులను వెంటనే భర్తీ చేయగలరు
ఖమ్మం జిల్లాలో మంత్రికి సంబంధించిన ప్రైవేటు మమత మెడికల్ కాలేజీ మాత్రమే ఉన్నది , పేదలు బడుగు బలహీన వర్గాల వారు ప్రైవేట్ కాలేజీలో చదువుకోవాలంటే ఆర్థిక స్తోమత లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు కావున మా ఖమ్మం జిల్లాకు ప్రభుత్వ మెడికల్ కాలేజీని మంజూరు చేయగలరు , మన రాష్ట్రంలో అన్ని జిల్లాలకు మెడికల్ కాలేజీ మంజూరు చేసి మా ఖమ్మం జిల్లా కు మాత్రం ఇప్పటివరకు ప్రభుత్వ కాలేజీ మంజూరు చేయలేదు దయచేసి ఇప్పడికి ఐన తమరు మా జిల్లా కు ఒక మెడికల్ కాలేజీని మంజూరు చేయగలరని మా యొక్క విన్నపము . మరియు మధిర CHC హాస్పిటల్ గా ఉన్నటువంటి హస్పత్రిని ఏరియా హాస్పిటల్ గా మార్చగలరు . మధిర మరియు నియోజకవర్గం PHC పరిదిలో 1 ) కోవిడ్ టెస్ట్ లు పెంచగలరు , 2 ) Vaccanation ను పూర్తి స్థాయిలో వేయగలరు . కొన్ని హాస్పిటల్స్ ఉన్న బిల్డింగ్స్ శిదిలవవాస్తలో ఉన్నవి వాటిని పూర్తిగా తొలగించి కొత్త బావనలను నిర్మించగలరు
కరోనా భాదితుల సేవలో సిపిఎం ….
బీవీక్ ఐసోలేషన్ సెంటర్కి 100 గుడ్ల వితరణ
ఖమ్మం మే,31,2021,శుక్రవారం
కరోణా పై యుద్ధం అంటూ డి వై ఎఫ్ ఐ ఖమ్మం జిల్లాకమిటి ఆధ్వర్యంలో చేస్తున్న కార్యక్రమాలలో భాగంగా డి వై ఎఫ్ ఐ కోణిజర్ల మండల కమిటి ఆధ్వర్యంలోగుంటే రత్న కుమార్ సహకారంతో బీవీక్ ఐసోలేషన్ సెంటర్ కి 100గుడ్లు సహాయం చేయడం జరిగింది.
ఈ సందర్భంగా డి వై ఎఫ్ ఐ జిల్లా కార్యదర్శి షేక్ బషీరుద్దీన్ మాట్లాడుతూ డి వై ఎఫ్ ఐ కోణిజర్ల మండల కమిటి కి, గుంటే రత్న ప్రసాద్ కు అభినందనలు తెలియజేశారు. డి వై ఎఫ్ ఐ ఖమ్మం జిల్లా పిలుపులో భాగంగా సహయ కార్యక్రమాలు చేస్తున్న నాయకులకు కార్యకర్తలకు అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా బీవీక్ జనరల్ మేనేజర్ వై.శ్రీనివాసరావు మాట్లాడుతూ డి వై ఎఫ్ ఐ కమిటి వారు చాలా రకాలుగా సహయం చేస్తున్నారని,ముఖ్యం గా జిల్లా వ్యాప్తంగా వాలంటీర్లు గా పనిచేస్తూ మరియు వస్తు రూపంలో కూడా చేయటం అభినందనీయమని ఆయన అన్నారు.గుంటే రత్న ప్రసాద్ గారి కి అభినందనలు తెలియజేశారు
ఈ సందర్భంగా యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్ రంజాన్ మాట్లాడుతూ గుంటే రత్న ప్రసాద్ కి, డి వై ఎఫ్ ఐ కొణిజర్ల మండల కమిటి కి అభినందనలు తెలియజేశారు. డి వై ఎఫ్ ఐ చేస్తున్న పని చాలా గొప్పదని ఆయన కొనియాడారు.
ఈ కార్యక్రమం లో వ్యకాసజిల్లా అధ్యక్షులు మెరుగు సత్యనారాయణ,కేవీపీస్ జిల్లా కార్యదర్శి నందిపాటి మనోహర్,ఆవాజ్ జిల్లా కార్యదర్శి గౌస్, డి వై ఎఫ్ ఐ జిల్లా నాయకులు సత్తెనపల్లి నరేష్, ఇంటూరి అశోక్,కనపర్తి గిరి,కూరపాటి శ్రీను,మెరుగు రమణ, రావులపాటి నాగరాజు, తదితరులు పాల్గొన్నారు