Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

ట్రాఫిక్ పోలీసుల ఫిర్యాదు… బంజారాహిల్స్ పీఎస్‌లో కేటీఆర్‌పై కేసు నమోదు!

  • నిన్న ఏసీబీ విచారణకు హాజరైన కేటీఆర్
  • అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించినట్లు ట్రాఫిక్ పోలీసుల ఫిర్యాదు
  • బీఆర్ఎస్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించినట్లు ఫిర్యాదు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్‌పై హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఫార్ములా ఈ-రేసింగ్ కేసులో కేటీఆర్ నిన్న ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఈ సమయంలో అనుమతి లేకుండా బీఆర్ఎస్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారని ట్రాఫిక్ పోలీసులు ఫిర్యాదు చేశారు.

ట్రాఫిక్ పోలీసుల ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. కేటీఆర్‌తో పాటు బీఆర్ఎస్ నేతలు గెల్లు శ్రీనివాస్, బాల్క సుమన్, మన్నె గోవర్ధన్, క్రిశాంక్, జైసింహ తదితరులపై కేసు నమోదు చేశారు. కాగా, ఫార్ములా ఈ-రేసింగ్ కేసులో కేటీఆర్ ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

Related posts

ఎన్ని కుట్రలు చేసినా డీఎస్సీ ప్రక్రియను పూర్తి చేశాం: డీప్యూటీ సీఎం భట్టివిక్రమార్క

Ram Narayana

అభివృద్ధి అంటే అద్దాల మేడలు, రంగుల గోడలు కాదు …కలెక్టర్ల సమావేశంలో సీఎం రేవంత్ !

Ram Narayana

అన్నా వస్తున్నా.. అడుగులో అడుగేస్తా.. చేతిలో చెయ్యేస్తా: బండ్ల గణేశ్

Drukpadam

Leave a Comment