Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

లంచాలు తీసుకోక తప్పదన్న తహసీల్దార్‌పై సస్పెన్షన్ వేటు

  • శ్రీ సత్యసాయి జిల్లాలో ఘటన
  • రైతు నుంచి లంచం డిమాండ్ చేసిన వీఆర్వోను సమర్ధించిన మడకశిర తహసీల్దార్
  • ప్రజలిచ్చే లంచాలతోనే అధికారిక పర్యటనకు ఏర్పాట్లు చేస్తామంటూ వ్యాఖ్య
Tahsildar suspended in Srisathyasai district for supporting vro asking for bribe

లంచం తీసుకోవడాన్ని సమర్థించుకున్న ఓ తహసీల్దారుపై తాజాగా ఉన్నతాధికారులు వేటు వేశారు. శ్రీసత్యసాయి జిల్లా మడకశిర తహసీల్దారు ఇటీవల లంచం తీసుకోవడం సబబేనంటూ ఓ రైతుతో వాదించిన వీడియో సంచలనంగా మారింది. వీఆర్వో లంచం కోసం పీడిస్తున్నాడంటూ ఫిర్యాదు చేసేందుకు వచ్చిన రైతుతో తహసీల్దార్ ముర్షావలీ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. 

‘‘ఏ ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రి ఉన్నా అంతే.. 2 నెలల కిందట నేను వచ్చిన కొత్తలో ఓ మంత్రి ఇక్కడకు వస్తే నలుగురు వీఆర్వోలు రూ.1.75 లక్షలు ఖర్చుచేశారు. ఒక్క రూపాయీ రాలేదు. ఇటీవల రాష్ట్రస్థాయి మహిళా అధికారి ఒకరు వచ్చారు. ఆ అమ్మ ఒక టెర్రరట. బెడ్‌రూంలోకి ఈగ కూడా రాకూడదట. ఆమె తినడానికి భారీ మెనూ ఇచ్చారు. దానిని చూస్తే భయపడిపోతారు. అవి మడకశిరలో దొరకవు. హిందూపురం నుంచి తెప్పించాలి. పాన్ కేక్ బెంగళూరులో దొరుకుతుంది. ఈ మెనూ ఖర్చు తహసీల్దారు భరిస్తాడా? అంతా వీఆర్వోలతోనే తెప్పిస్తాం. వీటికి మీ దగ్గర తీసుకున్న డబ్బే ఇస్తాం. లేకపోతే మా జీతాల్లోంచి ఖర్చు చేయాలా? అని ప్రశ్నించారు. ఒంటిపై ఉన్న కొన్ని పుళ్లను డాక్టర్‌కు మాత్రమే చూపించుకోగలమని కూడా చెప్పుకొచ్చాడు. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన జిల్లా కలెక్టర్ అరుణ్‌బాబు తహసీల్దార్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Related posts

పాములు పోతాయని పొగపెడితే.. రూ. 13 కోట్ల విలువైన ఇల్లు కాలిబూడిదైంది!

Drukpadam

తిరుమల కొండపై కారు దగ్ధం…

Ram Narayana

సిద్ధిపేట జిల్లాలో కేఏ పాల్ పై దాడి…

Drukpadam

Leave a Comment