Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

రేషన్ మాఫియాపై రాష్ట్ర ప్రభుత్వం కఠినమైన చర్యలు…మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

రేషన్ మాఫియాపై రాష్ట్ర ప్రభుత్వం కఠినమైన చర్యలు…మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
రేషన్ బియ్యం దారి మళ్లింపు, దుర్వినియోగంపై మంత్రి ఆందోళన
బియ్యం రీసైక్లింగ్‌లో పాల్గొంటే తీవ్ర పరిణామాలు

రేషన్ మాఫియాపై రాష్ట్ర ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంటుందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. రేషన్ బియ్యం దారి మళ్లింపు, దుర్వినియోగంపై మంత్రి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే బియ్యం, ఇతర సేవల నాణ్యతను అంచనా వేయడానికి సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్​లో ఓ రేషన్ దుకాణాన్ని పరిశీలించారు. గత ప్రభుత్వం అండదండలతో పలువురు నాయకులు, అధికారుల రేషన్ రీసైక్లింగ్ జరిపారని* ఆరోపించారు.

రేషన్ బియ్యం చాలా వ్యయంతో ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మంత్రి వెల్లడించారు. సివిల్ సప్లై కార్పొరేషన్​పై గత ప్రభుత్వ రూ.3,300 కోట్లు అప్పు మిగిల్చిందని ఆయన తెలిపారు. ప్రతి ఏటా రేషన్ షాప్ కింద ప్రభుత్వం కొంత సబ్సిడీ అమౌంట్ ఇవ్వలేదన్నారు. గడిచిన తొమ్మిదన్నరేళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర పౌర సరఫరాల శాఖకు ఆర్థిక సాయం అందించకపోవడం, సబ్సిడీలు చెల్లించకపోవడం, రైతుల నుంచి ప్యాడి ప్రొక్యూర్​మెంట్ కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోవడం వల్ల కార్పొరేషన్ అప్పులు రూ.56 వేల కోట్లకు చేరాయని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. అదేవిధంగా గత ప్రభుత్వం ఈ శాఖ పట్ల తీవ్ర నిర్లక్ష్యం వహించడంతో దశాబ్ద కాలంగా కార్పొరేషన్‌కు రూ.11 వేల కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. ఇందుకుగానూ ప్రతి ఏటా సివిల్ సప్లై కార్పొరేషన్​కు కట్టాల్సింది మూడు వేల కోట్ల వడ్డీ అని వివరించారు. కార్పొరేషన్ ఆర్థిక పరిస్థితి చాలా అధ్వాన్నంగా తయారైందని, కేసీఆర్ ప్రభుత్వం దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేషన్ నడపాలంటే ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. ఎంతో అసమర్థత, రాజకీయ దురుద్దేశంతో సివిల్ సప్లై కార్పొరేషన్​ను నడిపించారని దుయ్యబట్టారు.

బియ్యం రీసైక్లింగ్‌లో ఎవరైనా పాల్గొంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని, మిల్లర్లు లేదా రేషన్ బియ్యం రీసైక్లింగ్ చేస్తున్న ఇతర వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఉద్ఘాటించారు. తెలంగాణ రాష్ట్రంలో బియ్యం నిల్వ పెట్టుకోవడానికి స్థలం లేదని, ఉన్న స్టాక్ ఖరాబు అవుతుందని ఆయన తెలిపారు.
నాడు కర్ణాటక, తమిళనాడు ప్రభుత్వాలు బియ్యాన్ని కొనుగోలు చేస్తామని ముందుకొస్తే గత ప్రభుత్వం రాజకీయ కారణాలతో అమ్మలేదని మండిపడ్డారు. రేషన్ బియ్యం ప్యాడి ప్రొక్యూర్​మెంట్ వ్యవస్థ అనేది సివిల్ సప్లై డిపార్ట్​మెంట్​లో ఉన్న విషయాలను వ్యవస్థను మెరుగుపరిచే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన తెలిపారు. అదేవిధంగా పౌర సరఫరాలో ఉన్న వ్యవస్థను మొత్తాన్ని క్లీనప్ చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.

Related posts

ముత్యాల జలపాతం అడవుల్లో చిక్కుకున్న 84 మంది టూరిస్ట్‌లు!

Ram Narayana

కాంగ్రెస్‌కు షాక్.. ప్రగతి భవన్‌లో ప్రత్యక్షమైన యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు

Ram Narayana

కమిషన్ల తెలంగాణ… అవినీతిలో కర్ణాటకకు మించిపోయింది ..ఠాక్రే

Drukpadam

Leave a Comment