Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ప్రజాపాలన ప్రజలు సద్యినియోగంచేసుకోవాలి,..నోడల్ . అధికారి రఘనందనరావు

ప్రజాపాలనలో ఆరు గ్యారంటీ పథకాలకు దరఖాస్తులు నింపడం చాల సులువు
మీ దగ్గర ఉన్న ఆధారాలు రేషన్ కార్డు ,ఆధార్ జిరాక్స్ ఇవ్వండి

ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజాపాలన నోడల్ అధికారి ఎం. రఘునందన్ రావు అన్నారు. శుక్రవారం ప్రజాపాలన కార్యక్రమ పర్యవేక్షణ నోడల్‌ అధికారి, జిల్లా కలెక్టర్‌ వి.పి. గౌతమ్‌తో కలిసి కూసుమంచి మండలం గైగోళ్లపల్లి, ఖమ్మం నగరం 7వ డివిజన్ లోని మహిళా ప్రాంగణం, టేకులపల్లి డబుల్‌ బెడ్‌రూం సముదాయంల ఏర్పాటు చేసిన గ్రామ సభలో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను పరిశీలించి, ప్రజలకు ప్రజాపాలన కార్యక్రమంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అభయహస్తం కార్యక్రమంలో భాగంగా ఆరు గ్యారంటీలను అమలు పరచడానికి అర్హులైన ప్రజల నుండి దరఖాస్తులు సేకరించడం జరుగుతుందని తెలిపారు. ఈ నెల 28 నుండి జనవరి 6 వ తేదీ వరకు ప్రజాపాలన సభల్లో దరఖాస్తులు సరమర్పించాలని, దరఖాస్తుల సమర్పణకు ఎలాంటి దృవపత్రాలు అవసరం లేదని, కేవలం మీవద్ద ఉన్న ఆధార్‌ కార్డు, రేషన్‌ కార్డు జిరాక్స్‌ ప్రతులు మాత్రమే దరఖాస్తు ఫారంతో జతపర్చాలన్నారు. రేషన్‌ కార్డు లేని వారు తమ ఇంటి యజమాని పేరున ఉన్న రేషన్‌ కార్డు నెంబర్‌తో నమోదు చేసుకోవాలని తెలిపారు. ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ ప్రతిష్టాత్మక 6 గ్యారెంటీల పథకాల లబ్ధి చేకూర్చడం జరుగుతుందన్నారు. ఒక కుటుంబానికి ఒకే దరఖాస్తు ఫారం సరిపోతుందని, పథకాల వివరాలు సూచించన మేరకు, కుటుంబ సభ్యుల్లో ఎవరికి ఏ పథకం వర్తిస్తుందో, ఆ మేరకు వివరాలు పూరించాలన్నారు. సభల్లో ఏర్పాటుచేసిన హెల్ప్ డెస్క్ సిబ్బంది, దరఖాస్తుదారులకు దరఖాస్తు పూరించేందుకు తగు సలహాలు, సూచనలు చేస్తారన్నారు. ప్రజాపాలన సభ రోజున వీలుకాక దరఖాస్తు సమర్పించని వారు, జనవరి 6 లోపు వార్డు, గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో తమ దరఖాస్తులు సమర్పించవచ్చని, ఎటువంటి ఆందోళన అవసరం లేదని తెలిపారు. అధికారులు కార్యక్రమ ప్రత్యేకత గుర్తించి, చిత్తశుద్ధితో విధులు నిర్వర్తించాలని, సమర్పించిన దరఖాస్తుల్లో, ఒక్క దరఖాస్తు గల్లంతు అవకుండా పకడ్బందీగా భద్రపరచి, డాటా నమోదు చేయాలని అన్నారు.

 కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా 62 టీములు ఏర్పాటు చేసినట్లు, ఒక్కో టీముల 10 మందికి తగ్గకుండా అధికారులను నియమించి, తహసీల్దార్, ఎంపిడివో, మునిసిపల్ కమీషనర్లు టీమ్ లీడర్లుగా దరఖాస్తుల స్వీకరణ చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి కేంద్రంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటుచేసి, దరఖాస్తుల పూరణలో ప్రజలకు తోడ్పాటు అందిస్తున్నట్లు ఆయన అన్నారు. దరఖాస్తులు పూర్తి ఉచితంగా, ముందస్తుగానే ఇంటింటికి అందజేసినట్లు ఆయన తెలిపారు. దరఖాస్తుఫారం తో పాటు, ఆధార్, రేషన్ కార్డు జిరాక్స్ ప్రతులు జతచేయాలని అన్నారు. ఉమ్మడి కుటుంబ రేషన్ కార్డు ఉంటే, అన్ని దరఖాస్తుల్లో ఆ రేషన్ కార్డు నెంబర్ పొందుపర్చాలని ఆయన తెలిపారు. రైతు భరోసా పథకం గురించి, పట్టాదారు పాస్ బుక్, సర్వే నెంబర్, విస్తీర్ణం తదితర వివరాలు పొందుపర్చాలన్నారు. సమర్పించిన దరఖాస్తు  రశీదు తీసుకొని భద్రపర్చుకోవాలని ఆయన అన్నారు. అధికారులు స్వీకరించిన దరఖాస్తులను రిజిస్టర్లతో పాటు టీమ్ లీడర్ కి అప్పగించాలని, టీమ్ లీడర్ స్వయంగా ఎంపిడివో కార్యాలయానికి అందజేయాలని కలెక్టర్ తెలిపారు.   

ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ బి. సత్యప్రసాద్‌, ఖమ్మం నగరపాలక సంస్థ కమీషనర్‌ ఆదర్శ్‌ సురభి, సహాయ శిక్షణ కలెక్టర్‌ మయాంక్‌ సింగ్‌, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ ఎం. రాజేశ్వరి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారిణి విద్యాచందన, జిల్లా పంచాయితీ అధికారి హరికిషన్‌, జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖరశర్మ, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారిణి శ్రీలత, మహిళా ప్రాంగణం అధికారిణి వి. విజేత, గైగోళ్లపల్లి గ్రామ సర్పంచ్ శ్యామసుందర్ రెడ్డి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం, ఖమ్మంచే జారీచేయనైనది.

Related posts

మలబద్ధకం వేధిస్తుందా..? దాని వెనుక రిస్క్ ఉంది..!

Drukpadam

నెరవేరని వందరోజుల హామీలు …రేవంత్ ప్రభుత్వం పై కేటీఆర్ ధ్వజం

Ram Narayana

వర్క్ ఫ్రమ్ హోమ్ పై టెక్కీల అసహనం …కాపురాలు కూలి పోతాయని గగ్గోలు

Drukpadam

Leave a Comment