Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

మేడిగడ్డపై ఎన్నికలకు ముందు అధికారులు ఆ ప్రభుత్వానికి లబ్ధి చేకూర్చే విధంగా నివేదిక ఇచ్చారు: ఉత్తమ్ కుమార్ రెడ్డి

  • డ్యామ్ సేఫ్టీ అథారిటీకి నాటి అధికారులు ఇచ్చిన నివేదిక సరైనది కాదన్న ఉత్తమ్
  • కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం దరఖాస్తు చేస్తామని బీఆర్ఎస్ చెప్పిందన్న మంత్రి
  • కాళేశ్వరం ప్రాజెక్టుపై జ్యుడిషియల్ విచారణ జరిపిస్తామన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి
Uttam Kumar Reddy falts engineers over Medigadda issue

కాళేశ్వరం ప్రాజెక్టు… మేడిగడ్డ పిల్లర్ కుంగిపోయిన అంశానికి సంబంధించి ఎన్నికలకు ముందు అధికారులు… నాటి ప్రభుత్వానికి లబ్ధి చేకూర్చే విధంగా నివేదిక ఇచ్చారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు మేడిగడ్డలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ… మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలపై తాము చెప్పిన విషయాలు నిజమయ్యాయని అన్నారు. లక్షల కోట్ల అప్పులు… పదుల కోట్ల బిల్లులు బకాయిలు పడ్డారని విమర్శించారు. అసలు ఈ ప్రాజెక్టు కట్టిన ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు.

కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం దరఖాస్తు చేస్తామని నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పిందని… కానీ ప్రొఫార్మా ప్రకారం దరఖాస్తును పంపించలేదని కేంద్రం చెప్పిందని వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకు రావడంలో బీఆర్ఎస్ విఫలమైందన్నారు. కాళేశ్వరంపై జ్యుడిషియల్ విచారణ జరిపిస్తామన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధిస్తామని తెలిపారు.

మేడిగడ్డ బ్యారేజీ కుంగిందని… తప్పు జరిగింది కాబట్టే ఇలా జరిగిందన్నారు. బ్యారేజీ స్టోరేజ్ గత ప్రభుత్వం చెప్పినంతగా లేదని అనుమానం వ్యక్తం చేశారు. డిజైన్, కాన్సెప్ట్ అన్నింటా ఫెయిల్ అయ్యారన్నారు. పిల్లర్ కుంగిపోయిన అంశంపై ఎన్నికలకు ముందు అధికారులు గత ప్రభుత్వానికి అనుకూలంగా నివేదిక ఇచ్చారని ఆరోపించారు. డ్యామ్ సేఫ్టీ అథారిటీకి నాటి అధికారులు ఇచ్చిన నివేదిక సరైనది కాదని… ఇప్పుడు మేము అసలు నివేదిక ఇస్తామని వెల్లడించారు.

 లక్ష కోట్లలో రూ.50వేల కోట్ల అవినీతి జరిగింది: కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

  • కుట్రపూరితంగా ఖజానాను ఖాళీ చేశారని ఆరోపణ
  • ఇంత సాంకేతిక పరిజ్ఞానం ఉన్న కాలంలో ఆనకట్ట కుంగిపోవడం… తలదించుకునే పరిస్థితని విమర్శ 
  • వేరే సంస్థతో విచారణ జరిపించాలన్న జీవన్ రెడ్డి
MLC Jeevan reddy on Kaleswaram Project

కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రూ.1 లక్ష కోట్లు ఖర్చు పెట్టామని చెబుతున్నారని, కానీ అందులో రూ.50వేల కోట్ల వరకు అవినీతి జరిగిందని కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. గత ప్రభుత్వం కుట్రపూరితంగా ఖజానాను ఖాళీ చేసిందని విమర్శించారు. ఆలోచన లేకుండా రాష్ట్ర ప్రజలపై భారం మోపారని విమర్శించారు. ప్రాణహిత పనులు గతంలో కాంగ్రెస్ హయాంలోనే మూడొంతులు పూర్తయ్యాయని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందని దానిని పూర్తి చేయలేదని మండిపడ్డారు. ఇంతటి సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ఈ కాలంలో ఆనకట్ట కుంగిపోవడం ద్వారా ప్రపంచంలో తలదించుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు విషయమై అధికారులు… ఇంజినీర్ల సమాధానాలపై ఆధారపడకుండా వేరే సంస్థతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. జ్యూడిషియల్ విచారణ కోసం వేచి చూడవద్దని సూచించారు. అసలు రెండో టీఎంసీ పనులు పూర్తి కాకముందే మూడో టీఎంసీకి ఏమి అవసరం వచ్చింది? అని ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టులను నిర్లక్ష్యంగా కట్టారని ఆరోపించారు. పెన్ గంగను వదిలేసి వార్దాపై ఆనకట్టను ఎలా ప్రతిపాదించారు? అని ప్రశ్నించారు.

Related posts

బీఆర్ యస్ ఎమ్మెల్యే రాజయ్య పై పోలీస్ స్టేషన్ లో నవ్య ఫిర్యాదు …

Drukpadam

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్

Ram Narayana

బీఆర్ యస్ లో అంతా గుంభనం…మరికొద్ది రోజుల్లో సీట్ల ప్రకటన అంటూ సంకేతాలు …

Drukpadam

Leave a Comment