Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

దోపిడీ లేని సమాజ నిర్మాణమే కమ్యూనిస్టుల లక్ష్యం…కూనంనేని

దోపిడీ లేని సమాజ నిర్మాణమే కమ్యూనిస్టుల లక్ష్యమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. “నిత్యం ప్రజల పక్షాన నిలిచి నికరంగా పోరాడేది ఎర్ర జెండా మాత్రమేనన్నారు. భారత కమ్యూనిస్టు (సిపిఐ) 99వ ఆవిర్భావ దినోత్సవాన్ని -పురస్కరించుకుని శనివారం ఖమ్మంలో జనసేవాదళ్ కవాత్, భారీ ప్రదర్శన నిర్వహించారు. స్థానిక పెవిలియన్ మైదానం నుంచి 99 మంది రెడ్ షర్ట్ వాలంటీర్లు పార్టీ పతాకాలతో ముందు నడవగా వందలాది మంది రెడ్ షర్ట్ వాలంటీర్లు ఖమ్మం పుర వీధుల్లో కవాతు చేశారు. ప్రదర్శన -మయూరిసెంటర్, పాత బస్టాండ్, జెడ్పి సెంటర్, ఇల్లందు క్రాస్ రోడ్డు మీదుగా ఇందిరా నగర్ సిపిఐ పైలాన్ వద్దకు చేరుకుంది. దారి పొడవునా రెడ్్పర్ట్ వాలంటీర్ల కవాతు పుర ప్రజలను ఆకట్టుకుంది. పైలాన్ వద్ద పార్టీ పతాకాన్ని సిపిఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ సభ్యులు -మహ్మద్ మౌలానా ఆవిష్కరించారు. సిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సభలో కూనంనేని మాట్లాడుతూ 1848 -మార్క్స్, ఎంగిల్స్ పార్టీ ప్రణాళికను తయారు చేశారని క్రమేణ ప్రగతిశీల శక్తులు ఐక్యమయ్యాయని ఆయన తెలిపారు. భవిష్యత్తులో -అసమానతలు లేని సమాజ నిర్మాణం కోసం కమ్యూనిస్టు భావజాలం కలిగిన వారు పరితపించారని ఆయన తెలిపారు. దోపిడీ రహిత సమాజ -నిర్మాణం కమ్యూనిస్టులతోనే సాధ్యమని చెప్పడంతో పాటు సైన్సు అంగీకరించి సమాజ మనుగడ కోసం, అభివృద్ధి కోసం సైన్సు మిళితం చేసిన ఘనత కమ్యూనిస్టులకే దక్కుతుందన్నారు. వర్గ రహిత సమాజం స్వర్గంతో సమానమని వర్గ రహిత సమాజం కోసం సుదీర్ఘ కాలం పోరాడిన చరిత్ర ఒక్క కమ్యూనిస్టులకు మాత్రమే దక్కుతుందన్నారు. సామాజిక వివక్షతకు వ్యతిరేకంగా భూమి కోసం భూక్తి కోసం విముక్తి కోసం పోరాటాలు నిర్వహించిన కమ్యూనిస్టులది త్యాగాల చరిత్ర అని సాంబశివరావు తెలిపారు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత నైజాం నవాబు దేశంలో విలీనం చేయకుండా స్వతంత్ర రాజుగా ప్రకటించుకున్నప్పుడు కమ్యూనిస్టులు ప్రపంచ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే చారిత్రక పోరాటానికి నాయకత్వం వహించారన్నారు. నాలుగున్నర వేల మంది అమరుల బలిదానంతో నైజాం నుంచి తెలంగాణ – విముక్తి జరిగి 1948 సెప్టెంబరు 17న తెలంగాణకు స్వాతంత్య్రం సిద్ధించిందని ఆయన తెలిపారు. స్వాతంత్య్ర పోరాటంలో సైతం జైళ్లలో ఉండి లేదా పోరాటంలో మరణించిన అనేక మంది కమ్యూనిస్టులేనని ఆ భావజాలంతోనే స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారని కూనంనేని – తెలిపారు. చరిత్రను వక్రీకరించే పని ఎవరు చేయలేరని ఆయన స్పష్టం చేశారు. చీలికలు కమ్యూనిస్టు ఉద్యమాన్ని బలహీన పర్చాయని లేకుంటే -కమ్యూనిస్టు పురోగమనం మరో రకంగా ఉండేదని సాంబశివరావు తెలిపారు. ఎన్నికల విధానంలో చాలా మార్పులు వచ్చాయని ఆర్ధిక సంబంధాలతో ప్రజల అభిప్రాయాలు ముడిపడిపోతున్నాయన్న ఆవేదన సర్వత్రా వ్యక్తమవుతుందన్నారు. ఎన్నికలలో గెలుపోటములతో సంబంధం లేకుండా విప్లవకర పార్టీగా కమ్యూనిస్టు పార్టీ ముందుకు సాగుతుందన్నారు. దేశంలో ప్రజలు అనుభవిస్తున్న ప్రతి హక్కు వెనుక -ఎర్ర జెండాల పోరాటం ఉందని గతంలో అనేక హక్కులు సాధించడం జరిగిందని ఇటీవల అటవీ హక్కుల చట్టం, మహాత్మా గాంధీ గ్రామీణ -ఉపాధి హామీ పథకం, సమాచార హక్కు చట్టం ఇవన్ని కమ్యూనిస్టుల పోరాట ఫలితంగానే వచ్చాయన్నారు. కమ్యూనిస్టులు పోరాడిన తర్వాత -అధికార ముద్ర వేస్తే వేసి ఉండవచ్చు కానీ అసలు విజయం కమ్యూనిస్టులదేనన్నారు. ప్రజలు ప్రశ్నించే గొంతుకలను బతికించాలని ఆయన -విజ్ఞప్తి చేశారు. ప్రశ్నించే వారు లేకపోతే దోపిడీ మరింతగా పెరుగుతుందని హక్కులు హరించబడతాయని సాంబశివరావు తెలిపారు. ఆర్ధిక -అరాచకవాదం మరింతగా ప్రబలుతుందని హెచ్చరించారు. ఇటీవల జరిగిన సింగరేణి ఎన్నికల్లో రూపాయి ఖర్చు లేకుండా ఏఐటియుసి ఘన -విజయం సాధించిందని స్వల్ప తేడాతో మూడు ఏరియాల్లో ఓటమి చవి చూశామన్నారు. రాను రాను కమ్యూనిస్టుల పట్ల ఆదరణ పెరుగుతుందని కొన్ని స్వార్ధపర శక్తులు పార్టీలను విడినా నిజమైన కమ్యూనిస్టులు ఎప్పుడు ఎర్ర జెండా నీడనే ఉంటారని కూనంనేని స్పష్టం చేశారు. వాస్తవ పరిస్థితులను గుర్తెరిగిన తర్వాత ఎర్ర జెండాల పురోగమనం తప్పదన్నారు. కార్మిక వాడలు పారిశ్రామిక ప్రాంతాల్లో -రెపరెపలాడుతున్న ఎర్ర జెండా మున్ముందు వాడవాడలా రెపరెపలాడక తప్పదన్నారు. ఈ సభలో సిపిఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు, రాష్ట్ర కంట్రోల్ కమిషన్ సభ్యులు మహ్మద్ మౌలానా తదితరులు ప్రసంగించగా సిపిఐ జిల్లా సహయ కార్యదర్శి దండి సురేష్, -రాష్ట్ర సమితి సభ్యులు జమ్ముల జితేందర్ రెడ్డి, ఎస్కె జానిమియా, యర్రాబాబు, ఏపూరి లతాదేవి, కొండపర్తి గోవిందరావు, సిద్దినేని కర్ణకుమార్, ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్. జనసేవాదళ్ కార్యకర్తలు, పార్టీ కార్యవర్గ సభ్యులు, వివిధ ప్రజా సంఘాల బాధ్యులు పాల్గొన్నారు.

  • ఆకట్టుకున్న కవాత్:

పార్టీ 99వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం ఖమ్మంలో నిర్వహించిన కవాత్ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సవాన్ని నింపింది.

99వ ఆవిర్భావ దినోత్సవానికి సూచికగా 99 మంది రెడ్ షర్ట్ వాలంటీర్లు పార్టీ జెండాలను ధరించి ముందు నడువగా వారి వెనుక రెడ్్పర్ట్

వాలంటీర్లు కవాతు నిర్వహించారు. ఆ తర్వాత డప్పు దళ నృత్యాలు ముందుకు సాగాయి. పార్టీ నాయకులు భారీ ప్రదర్శనగా కవాతును

-అనుసరించారు. 99వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పైలాన్ను ఏర్పాటు చేశారు. పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి బహిరంగ సభ

-నిర్వహించారు.

Related posts

ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు ….

Drukpadam

క్లిన్ అండ్ గ్రీన్ సిటీగా ఖమ్మంను తీర్చు దిద్దాలి …మంత్రి తుమ్మల

Ram Narayana

పువ్వాడ నామినేషన్ నిబంధనలకు అనుగుణంగా లేదు తిరస్కరించండి… తుమ్మల

Ram Narayana

Leave a Comment