Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

కాంగ్రెస్ 420 హామీల పేరుతో బీఆర్ఎస్ బుక్‌లెట్ విడుదల

  • లోక్ సభ ఎన్నికల కోడ్ రాకముందే హామీలు నెరవేర్చాలని బీఆర్ఎస్ డిమాండ్
  • అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ ఇష్టారీతిన హామీలు ఇచ్చిందని విమర్శలు
  • హామీల అమలులో ఆలస్యం సహా వివిధ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తోన్న బీఆర్ఎస్
BRS releases booklet on congress promises

కాంగ్రెస్ 420 హామీల పేరుతో బీఆర్ఎస్ బుధవారం బుక్ లెట్‌ను విడుదల చేసింది. అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలు ఇచ్చిందని బీఆర్ఎస్ ఆరోపించింది. ఇష్టారీతిన ఇచ్చిన హామీలను అమలు చేసే పరిస్థితి లేదని విమర్శించింది. అందుకే హామీల అమలును ఈ ప్రభుత్వం ఆలస్యం చేస్తోందని పేర్కొంది. కాంగ్రెస్ ప్రభుత్వం తన మాటకు కట్టుబడి లోక్ సభ ఎన్నికల కోడ్ రాకముందే ఆరు గ్యారెంటీలతో పాటు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది.

ఇటీవల మాజీ మంత్రి కేటీఆర్ విడుదల చేసిన స్వేదపత్రం ప్రతులను ఈ సందర్భంగా పార్టీ నేతలకు అందించింది. కేసీఆర్ ఈ పదేళ్ల కాలంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, వాటి ద్వారా కలిగిన లబ్ధిని వివరించింది. అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేసేలా ఒత్తిడి చేసేందుకు బీఆర్ఎస్ ప్రణాళికలు రచిస్తోంది. హామీల అమలులో ఆలస్యం వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని భావిస్తోంది.

Related posts

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అరెస్ట్, ఇందిరా పార్క్ వద్ద ఉద్రిక్తత

Ram Narayana

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో బీఎస్పీ… 20 మందితో తొలి జాబితా ప్రకటన

Ram Narayana

వినోద్ కుమార్ సహా పలు కార్పోరేషన్ చైర్మన్ల రాజీనామా

Ram Narayana

Leave a Comment