- పోలీసులు ఇప్పటికే తనపై 11 కేసులు పెట్టారని.. మరో కేసు పెట్టే అవకాశముందని కోర్టుకు తెలిపిన రఘురామ
- గతంలో సీఐడీ అధికారులు తనను అరెస్ట్ చేసి చిత్రహింసలకు గురి చేశారని ఆరోపణ
- రఘురామ తరఫున న్యాయవాదులు ఉమేశ్ చంద్ర, వై.వి.రవిప్రసాద్ పిటిషన్
సంక్రాంతి పండుగ సందర్భంగా తన ఊరికి వెళ్లడానికి తనకు రక్షణ కల్పించాలంటూ ఎంపీ రఘురామ కృష్ణరాజు ఏపీ హైకోర్టులో గురువారం పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులు ఇప్పటికే తనపై 11 కేసులు పెట్టారని… మరో కేసు పెట్టే అవకాశం ఉందని ఆయన కోర్టుకు తెలిపారు. ఈ మేరకు ఆయన తరఫున న్యాయవాదులు ఉమేశ్ చంద్ర, వై.వి. రవిప్రసాద్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
గతంలో సీఐడీ అధికారులు తనను అరెస్ట్ చేసి… చిత్రహింసలకు గురి చేశారని రఘురామ కృష్ణరాజు తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ క్రమంలో తనపై తప్పుడు కేసులు పెట్టి మరోసారి అరెస్ట్ చేసే అవకాశముందని అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు నిబంధనలు పాటించేలా ఆదేశాలు ఇవ్వాలని తన పిటిషన్‌లో పేర్కొన్నారు.