Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

సీతారామ ప్రాజెక్ట్ పై మంత్రి తుమ్మల ఉడుం పట్టు …

ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు తాగు,సాగునీటిని కల్పించే సీతారామ ప్రాజెక్ట్ పై రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ , కో -ఆపరేటివ్ , జౌళి శాఖలమంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉడుం పట్టుపట్టారు .. వచ్చే మే నాటికే గోదావరి జలాలను జిల్లాలో పరుగులు పెట్టించాలని లక్ష్యంతో అధికారులను ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు …తన జ్యాస ,శ్వాస ,జీవితాశయం సీతారామ ప్రాజెక్ట్ ద్వారా ఖమ్మం జిల్లా ప్రజల కాళ్ళు కడగటమేనని అనేక వేదికల మీద చెప్పిన మంత్రి తుమ్మల అందుకు అనుగుణంగా అనేక పనులు ఉన్న సీతారామ ప్రాజెక్ట్ పనుల వేగం పెంచేందుకు తరుచు ప్రాజెక్ట్ పనులను స్వయంగా పరిశీలిస్తున్నారు …
రాష్ట్ర స్థాయిలో కూడా సచివాలయంలో నీటి పారుదల శాఖామంత్రితో పాటు ఉన్నతాధికారులతో సీతారామపై సమీక్ష నిర్వహించారు …గురువారం మంత్రి తుమ్మల ప్రాజెక్ట్ పనులను సత్తుపల్లి మండలం యతలకుంట దగ్గర టన్నెల్ వర్క్స్ ను పరిశీలించారు … ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీతారామ ప్రాజెక్ట్ తో పది లక్షల ఎకరాలు గోదావరి జలాలతో సస్య శ్యామలం చేస్తామన్నారు …

యతలకుంట దగ్గర జరుగుతున్న టన్నెల్ రెండు వైపుల నుండి పనులు చేసి పూర్తి చేయాలన్నారు …ఇప్పుడు ఉన్న నూతన టెక్నాలజీని ఉపయోగించి త్వరిత గతిన పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు… యాతాలకుంట టన్నెల్ పూర్తి అయితే బేతుపల్లి,లంకా సాగర్ కు నీళ్లు అందుతాయని ఆయన పేర్కొన్నారు … గండుగులపల్లి లో నాలుగో పంప్ హౌస్ పనులు చకచకా జరుగుతున్నాయని యతలకుంట కూడా త్వరగా పూర్తీ చేయాలనీ అన్నారు .సత్తుపల్లి నియోజక వర్గానికి సీతారామ ప్రాజెక్ట్ లో ప్రధానమైంది యతాల కుంట టన్నెల్ అని యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని అందుకు ఒక వేళ ఏవైనా ఇబ్బందులు ఉంటె తనకు తెలియజేయాలని అన్నారు … తన రాజకీయ లక్ష్యం సీతారామ ప్రాజెక్ట్ పూర్తి చేయటమన్నారు …దీనివల్ల ఉభయ జిల్లాలలోని 10 లక్షల ఎకరాల భూములు సస్యశ్యామలం అవుతాయన్నారు …

Related posts

పొంగులేటి అభినందనలు …ప్రజాతీర్పును గౌరవిస్తున్నా…కందాల ఉపేందర్ రెడ్డి!

Ram Narayana

బీఆర్ యస్ లో పరుగులు పెడుతున్న నాయకులు…ప్రజల్లో కానరాని జోష్…

Ram Narayana

ఖమ్మం నుంచే తుమ్మల పోటీ …!

Ram Narayana

Leave a Comment