Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

తమ్మినేని ఆరోగ్యంపై ఆందోళన అవసరంలేదు …హైద్రాబాద్ ఏ ఐ జిలో చికిత్స

సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మంగళవారం స్వల్ప అస్వస్థతతో ఖమ్మంలోని ఒక ప్రవేట్ ఆసుపత్రిలో చేరారు. తమ్మినేని తన స్వగ్రామమైన తెల్దారుపల్లి ఉండగా కొంత ఆన్ ఈజీగా ఉన్నారు. రెండు రోజులుగా ఖమ్మం జిల్లాలో వరుసగా పర్యటనలలో విరామం లేకుండా ఉన్నారు .పార్టీ సమావేశాల్లో పాల్గొంటూనే పరామర్శలు చేస్తున్నారు .. సోమవారం సాయంత్రం తనకు నలతగా ఉందని కుటుంబ సభ్యులకు చెబుతున్నారు. అయితే మంగళవారం ఉదయం మరింత నీరసంగా ఉండటంతో గమనించిన కుటుంబసభ్యులు ఖమ్మంలోని ప్రవేట్ హాస్పటల్ కు చికిత్స నిమిత్తం తీసుకోని వచ్చారు … ఆయన్ను పరీక్షించిన వైద్యులు బ్రీతింగ్ ప్రాబ్లెమ్ ఉందని ,గతంలోలాగే గుండెకు నీరు వచ్చిందని తెలిపారు …అందువల్ల పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు …ఎందుకైనా మంచిదని మెరుగైన వైద్యం కోసం హైద్రాబాద్ వెళ్లాలని సూచించారు …

దీంతో ఖమ్మం డాక్టర్ల సలహా మేరకు హుటాహుటిన ప్రత్యేక ఎస్కార్ట్ తో అంబులెన్స్ లో ఖమ్మం నుంచి హైద్రాబాద్ తరలించారు … హైదరాబాదులోని గచ్చిబౌలి ఏఐజి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఐ సి యు లో ఉన్నారు. వివిధ రకాల పరీక్షలు చేశారు. డాక్టర్లు పర్యవేక్షిస్తున్నారు. తమ్మినేని ఆరోగ్యం గురించి ఆందోళన చెందనవసరం లేదని ఏ ఐ జి హాస్పటల్ డాక్టర్లు తెలిపారు …ఆయనకు రెండు రోజులపాటు బాగా విశ్రాంతి అవసరమని అందువల్ల పార్టీ కార్యకర్తలు, అభిమానులు ,శ్రేయోభిలాషులు ఎవరు ఆసుపత్రికి రావద్దని డాక్టర్లు సూచించారు .

2004 లో తమ్మినేని మొదటిసారిగా గుండెపోటు వచ్చింది … ఖమ్మంలోని క్యూర్ హాస్పటల్ కు తరలించి అక్కడ నుంచి హైద్రాబాద్ లోని కేర్ హాస్పటల్ లో చేర్పించారు . డాక్టర్లు గుండెకు స్టెంట్లు వేశారు …నాటి నుంచి ఆయన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గానే పాల్గొంటున్నారు … సుదీర్ఘ సైకిల్ యాత్ర , పాదయాత్ర లు చేసి రాష్ట్రమంతా తిరిగారు …మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీచేశారు …

Related posts

సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన సిపిఎం నేత తమ్మినేని…

Ram Narayana

ఉచిత విద్యుత్‌పై వ్యాఖ్యల వివాదం.. రేవంత్ రెడ్డి ట్వీట్!

Drukpadam

ప్రధానితో భేటీకి సీఎం రేవంత్ ,డిప్యూటీ సీఎం భట్టి

Ram Narayana

Leave a Comment