Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

తమ్మినేనిని పరామర్శించిన డిప్యూటీ సీఎం భట్టి,రెవిన్యూ మంత్రి పొంగులేటి!

అస్వస్థతకు గురై హైద్రాబాద్ లోని గచ్చిబౌలిలో గల ఎఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ను రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క , రెవిన్యూ ,గృహనిర్మాణ , సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు గురువారం ఉదయం వేరు వేరుగా ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు … భట్టి వెంట మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి , ఉన్నారు …అంతకు ముందే పొంగులేటి వచ్చారు …పొంగులేటి వెంట డీసీసీబీ మాజీ చైర్మన్ మువ్వా విజయబాబు ఉన్నారు …ఈసందర్భంగా ఎఐజీ సి అండ్ ఎండి నాగేశ్వర్ రెడ్డి తో మంత్రులు మాట్లాడారు …తమ్మినేనికి మంచి వైద్యం అందుతుందని ఎలాంటి ఆపరేషన్ అవసరం లేదని మందులతోనే క్యూర్ అవుతారని,ఈరోజు రేపు వెంటిలేటర్ తొలగిస్తామన్నారు … రెండు రోజుల్లో జనరల్ వార్డ్ కు తరలించే అవకాశం ఉందని డాక్టర్లు తెలిపారు … వెళ్లినవారిని గుర్తించి స్పందిస్తున్నారని అన్నారు … సీఎంఓ ఆఫీస్ కూడా తమ్మినేని ఆరోగ్యం గురించి వాకబు చేసింది …దావోస్ పర్యటనలో ఉన్న తిరిగి వచ్చిన తర్వాత తమ్మినేనిని పరామర్శిస్తారని సమాచారం ….

మొదటి రోజునే వెళ్లి పరామర్శించిన మాజీమంత్రి బీఆర్ యస్ నేత హరీష్ రావు ,తిరిగి గురువారం ఆసుపత్రికి వచ్చి తమ్మినేనిని పరామర్శించి డాక్టర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు …పల్లా రాజేశ్వర్ రెడ్డి బుధవారం ఆసుపత్రికి వచ్చి పరామర్శించారు ..పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు తమ్మినేనిని పరామర్శించి భార్య ఉమకు దైర్యం చెప్పారు …ఎమ్మెల్సీ ఎ .నర్సిరెడ్డి ,పార్టీ నేతలు బి .వెంకట్ , పోతినేని సుదర్శన్ ,ఎస్ . వీరయ్య , జూలకంటి రంగారెడ్డి ,కుటుంబసభ్యులు తదితరులు ఆసుపత్రి వద్దనే తమ్మినేని ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు …

నాలుగు రోజుల క్రితం తన స్వగ్రామమైన తెల్దారుపల్లిలో ఇంటివద్ద ఉండగా నలతగా ఉండటంతో సోమవారం ఆయన ఖమ్మంలోని ఆరోగ్య ఆసుపత్రికి చెకప్ కోసం తీసుకోని వెళ్లారు …అక్కడ ఆయన్ను పరీక్షించిన ప్రముఖ గుండె వైద్యనిపుణులు సుబ్బారావు ఊపిరి తిత్తుల్లో నీరు ఉందని , కిడ్నీలో ఇంఫెక్షన్ ఉందని ఎందుకైనా మంచిదని హైద్రాబాద్ తీసుకోని వెళ్ళమని సలహా ఇచ్చారు …దీంతో హుటాహుటిన ప్రత్యేక అంబులెన్స్ లో ప్రభుత్వమే ఎస్కార్ట్ ఇచ్చి హైద్రాబాద్ లోని ఎఐజీ ఆసుపత్రికి తరలించారు …అక్కడ పరీక్షగా డాక్టర్లు తమ్మినేనికి గుండె బలహీనంగా ఉండటంతోపాటు ఊపిరితిత్తుల్లో , కిడ్నీలలో ఇబ్బంది ఉందని , ఊపిరి తిత్తుల్లో నీరు తీసేయాల్సి ఉందని ,చెప్పారు …ఆయన ఆసుపత్రిలో చేరేటప్పటికి బీపీ ఉంది …వెంటనే చికిత్స మొదలు పెట్టిన డాక్టర్లు బీపీ ని సాధారణ స్థితికి తీసుకోని వచ్చారు …మిగతా అవయాలు కూడా సాధారణ స్థితికి వచ్చి ఆయన వైద్యానికి స్పందించడంతో త్వరలోనే రికవరీ అవుతాడని చెప్పడంతో కుటుంబసభ్యులు , పార్టీ నాయకులు,కార్యకర్తలు , అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు …

Related posts

ఐటీ సోదాల్లో రాజకీయాలు …బీజేపీయేతర పక్షాలే టార్గెట్…

Ram Narayana

నవగ్రహ యాగం చేపట్టిన బీఆర్ఎస్ అధినేత!

Ram Narayana

సండ్ర గెలుపు కోసం సత్తుపల్లిలో గులాబీ కవాతు …

Ram Narayana

Leave a Comment