వైరా మండలం సోమవారం వద్ద కూలిన స్లాబ్ పోస్తున్న గ్రీన్ ఫీల్డ్ హైవే బ్రిడ్జి…
కొంతమంది కూలీలకు గాయాలు ..
తప్పిన ప్రాణాపాయం….ఊపిరి పీల్చుకున్న కూలీలు
ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే బ్రిడ్జి ప్రమాదంతో కంగుతిన్న ప్రజలు
మంత్రులు , జిల్లా కలెక్టర్ ఆరా …సైట్ ఇంజినీర్లు , కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకొనే అవకాశం
వైరా మున్సిపాలిటీ పరిధిలోని సోమవారం గ్రామం సమీపంలో నూతనంగా నిర్మాణం చేపట్టిన గ్రీన్ ఫీల్ హైవే రోడ్డు బ్రిడ్జి నిర్మాణ పనులు స్లాబ్ జరుగుతుండగానే ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. బ్రిడ్జి కులే విధానాన్ని ముందుగానే గమనించిన కార్మికులు ఒక్కసారిగా ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు దుకడంతో వారికి స్వల్ప గాయాలయ్యావి. దీనితో సోమవారం వద్ద గ్రీన్ ఫీల్డ్ హైవే బ్రిడ్జి కూలింది అనే వార్త తెలియగానే పెద్ద ఎత్తున ప్రజలు అక్కడికి గుమ్మి గూడారు, నిర్మాణ దశలోనే స్లాబ్ వేస్తుండగానే బ్రిడ్జి కూలిపోవడం పై పలు విమర్శలకు తావిస్తున్నాయి. అసలు బ్రిడ్జి నిర్మాణం చేపడుతుండగానే స్లాప్ వేసిన కొద్ది క్షణాలకే కూలిపోవడంలో ఆంతర్యం ఏమిటి ,అధికారుల పర్యవేక్షణ లోపమా ఇంజనీర్ల లోపమా ,మరి ఇతర కారణాలైనా ఉన్నాయా అనేది ఇప్పుడు సర్వత్ర చర్చ అంశంగా మారింది. నిర్మాణం చేపట్టిన కొద్ది గంటలకే బ్రిడ్జి కూలిపోవడం పట్ల పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదే బ్రిడ్జి నిర్మాణం జరిగి ప్రజలు వాహనాలు పోతూ ఉంటే ప్రమాదం సంభవిస్తే ఎలాంటి నష్టం జరిగేది. ఒక్కసారిగా బ్రిడ్జి కోలుతుండడంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు తమ వాళ్ళకు ఏమైందో అని బ్రిడ్జ్ వద్దకు తరలివచ్చారు. స్వల్ప గాయాలతో కార్మికులు బయటపడ్డారు… ఈ విషయం పై జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క , మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ,తుమ్మల నాగేశ్వరరావు, జిల్లా కలెక్టర్ కు ఫోన్ చేసి ఆరా తీశారు …పెద్ద ప్రమాదం తప్పినందుకు అందరు గాలిపీల్చుకున్నారు …
నాసిరకం ఇనుప రాడ్లు నాసిరకం పనులు నిర్మాణం చేయడం వల్లే ఈ బ్రిడ్జి కూలిందని స్థానికులు ఆరోపించారు… ఖమ్మం నుంచి దేవరపల్లి వెళ్లే గ్రీన్ ఫీల్డ్ హైవే రహదారికి 33 కిలోమీటర్ల వరకు 772 కోట్ల నిధులు కేటాయించారు.. ఈ పనులను గత ఏడాది నుంచి పనులు ప్రారంభించారు ముందుగా పలు ప్రాంతాలలో బ్రిడ్జిలను నిర్మాణం చేపడుతూ రహదారి పనులు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది గ్రీన్ఫీల్డ్ వర్క్ పనులలో అధికారుల పర్యవేక్షణ కరువైందని నాసిరకంతో పనులు చేస్తున్నారని స్థానికులు ఆరోపించారు నిర్మాణంలోనే ఇలా జరిగితే రహదారి పూర్తయ్యేసరికి ఎన్ని ప్రమాదాలు జరుగుతాయని స్థానికులు ఆరోపించారు ప్రమాద సంఘటన స్థలాన్ని నేషనల్ హైవే అధికారులు పోలీసులు పరిశీలించారు..