Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అంతర్జాతీయంప్రమాదాలు ...

జపాన్ లో భారీ భూకంపం…

  • నైరుతి జపాన్ లో 6.9 తీవ్రతతో భూకంపం
  • సునామీ హెచ్చరికలు జారీ చేసిన యూఎస్ జీఎస్
  • కాసేపటి తర్వాత సునామీ హెచ్చరికలు ఉపసంహరణ 

జపాన్ లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై ఈ భూకంపం తీవ్రత 6.9గా నమోదైంది. భారీ భూకంపం నేపథ్యంలో అమెరికా జియోలాజికల్ సర్వే సంస్థ (యూఎస్ జీఎస్) సునామీ హెచ్చరికలు జారీ చేసింది. జపాన్ వాతావరణ సంస్థ (జేఎంఏ) కూడా సునామీ అలర్ట్ ప్రకటించింది. మూడు అడుగుల మేర సునామీ అలలు విరుచుకుపడే అవకాశం ఉందని, తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది. 

కాసేపటి తర్వాత యూఎస్ జీఎస్ సునామీ హెచ్చరికలు ఉపసంహరించుకున్నప్పటికీ… జేఎంఏ మాత్రం తీర ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.. ఈ భూకంప కేంద్రం జపాన్ నైరుతి ప్రాంతంలో ఉన్నట్టు గుర్తించారు. క్యుషు ప్రాంతంలోని మియజాకి రాష్ట్రంలో రాత్రి 9.19 గంటలకు (జపాన్ కాలమానం ప్రకారం) భూకంపం సంభవించింది.

Related posts

ప్రాణభయంతో భారత్ లోకి వస్తున్న మయన్మార్ సైనికులు… అమిత్ షా స్పందన

Ram Narayana

పంట కాలువలోకి దూసుకువెళ్లిన కారు .. తల్లి, ఇద్దరు కుమారుల మృతి

Ram Narayana

ట్రంప్ గెలుపు కోసం ఎలాన్ మ‌స్క్ ఎంత‌ ఖ‌ర్చు చేశాడో తెలిస్తే షాక‌వ్వాల్సిందే!

Ram Narayana

Leave a Comment