Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జనరల్ వార్తలు ...

సెర్చ్ చేసేందుకు కొత్త పద్ధతి కనుగొన్న గూగుల్

  • ఏఐ సాయంతో నూతన టెక్నాలజీకి శ్రీకారం
  • త్వరలో శాంసంగ్ ఎస్24 ఫోన్ల ద్వారా లేటెస్ట్ సెర్చ్ విధానం
  • గూగుల్ పిక్సెల్ 8, పిక్సెల్ 8 ప్రో మోడళ్లలోనూ కొత్త టెక్నాలజీ

ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ ఎప్పటికప్పుడు నూతన సాంకేతికతను యూజర్లకు అందించేందుకు ప్రయత్నిస్తుంటుంది. ఈ క్రమంలో ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)తో కూడిన సరికొత్త సెర్చ్ విధానాన్ని గూగుల్ కనుగొంది. స్మార్ట్ ఫోన్ వినియోగదారులు గూగుల్ లో సెర్చ్ చేసేందుకు ఈ కొత్త పద్ధతి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. 

స్మార్ట్ ఫోన్ స్క్రీన్ పై కనిపించే ఏదైనా ఫొటో కానీ, టెక్ట్స్ సందేశంలో కానీ మనకు కావాల్సిన అంశం చుట్టూ రౌండప్ చేస్తే చాలు… ఆ వృత్తంలోని అంశానికి సంబంధించిన సమాచారం ప్రత్యక్షమవుతుంది. ఇప్పటివరకు గూగుల్ సెర్చ్ అంటే ఏదైనా పదాలు టైప్ చేయడం, ఇమేజ్ సాయంతో సెర్చ్ చేయడం, వాయిస్ అసిస్టెంట్ ద్వారా సెర్చ్ చేయడం అన్నట్టుగా ఉండేది. ఇప్పుడీ కొత్త విధానం ఓ సాంకేతిక విప్లవం అనొచ్చు. 

త్వరలోనే శాంసంగ్ గెలాక్సీ ఎస్24 స్మార్ట్ ఫోన్ల లాంచింగ్ చేయనున్నారు. ఈ కొత్త సెర్చ్ విధానాన్ని కూడా ఆ ఫోన్లలో పొందుపరచనున్నారు. అంతేకాదు, గూగుల్ పిక్సెల్ 8, పిక్సెల్ 8 ప్రో ఫోన్లలోనూ ఈ సర్కిల్ సెర్చ్ అందుబాటులో ఉంటుంది.

Related posts

ఆధార్ ఉచిత అప్ డేట్ కు సమీపిస్తున్న గడువు

Ram Narayana

లలిత్ మోదీపై బౌలర్ ప్రవీణ్ కుమార్ సంచలన ఆరోపణలు

Ram Narayana

జియో ఎయిర్‌ఫైబర్ కావాలా? ఇలా బుక్ చేసుకోండి!

Ram Narayana

Leave a Comment