తెలంగాణ వార్తలు

జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, భార్య నీలిమపై కేసు

  • పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు
  • తప్పుడు పత్రాలతో భూఆక్రమణకు ప్రయత్నించారని ఆరోపణలు
  • పీర్జాదిగూడకు చెందిన రాధిక అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు

బీఆర్ఎస్ జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఆయన భార్య నీలిమపై కేసు నమోదయింది. పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్‌లో ఈ కేసు నమోదయింది. తప్పుడు పత్రాలతో భూఆక్రమణకు యత్నించారని ఆరోపణలు వచ్చాయి. పీర్జాదిగూడకు చెందిన రాధిక అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై దర్యాఫ్తు చేపట్టిన పోలీసులు ఎమ్మెల్యే దంపతులపై కేసు నమోదు చేశారు.

జోడిమెట్ల సమీపంలోని చౌదరిగూడ గ్రామపంచాయతీ పరిధిలోని ఫ్లాట్ల విషయంలో పల్లా దంపతులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ ప్లాట్లు 1984లో లే అవుట్ అయినట్లుగా చెబుతున్నారు. ఇక్కడి 160 మంది ప్లాట్ యజమానులను ఆయన ఇబ్బంది పెడుతున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక్కడి ప్లాట్లు తాను చెప్పిన ధరకు తనకే ఇవ్వాలని లేదంటే ఈ ప్లాట్లు దక్కనీయనని పల్లా హెచ్చరించినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో తమ ప్లాట్లను ఆక్రమించారంటూ రాధిక అనే బాధితురాలు ఫిర్యాదు చేశారు.

Related posts

 ప్రాణభయంతో పరుగులు.. ఇంటి పైకప్పుపైకి చేరిన ఎద్దు…

Ram Narayana

అది కేసీఆర్ కుటుంబంలో కుంపటి

Ram Narayana

తెలంగాణ మహాలక్ష్ములకు అభినందనలు: రేవంత్ రెడ్డి ట్వీట్

Ram Narayana