Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

రెస్పెక్టెడ్ సర్… అంటూ సీఎం జగన్ కు పవన్ కల్యాణ్ లేఖ

  • ఏపీలో కుల గణన
  • ఎన్నికల సమయంలోనే ఎందుకు అంటూ పవన్ లేఖాస్త్రం
  • సీఎం జగన్ కు 12 ప్రశ్నలు సంధించిన జనసేనాని
  • జగన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి అంటూ స్పష్టీకరణ

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఏపీ సీఎం జగన్ కు లేఖాస్త్రం సంధించారు. రెస్పెక్టెడ్ సర్ అంటూ సీఎం జగన్ ను సంబోధించారు. మీ రాజ్యాంగేతర వాలంటీర్ వ్యవస్థ ఏపీలో కులగణన పేరిట సున్నితమైన వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తోంది… అందుకే ఈ లేఖ రాస్తున్నానంటూ పవన్ స్పష్టం చేశారు. అందుకే ప్రజల తరఫున జనసేన పార్టీ మీకు కొన్ని ప్రశ్నాస్త్రాలు సంధిస్తోంది… దయచేసి స్పందించండి అని కోరారు. 

అయితే, వ్యక్తిగత దూషణలకు పోకుండా, సంబంధిత ప్రశ్నలకు జవాబులు ఇస్తారని ఆశిస్తున్నాను అంటూ పవన్ పేర్కొన్నారు. ఇక తన లేఖకు ఎన్నికల వేళ కుల గణన ఎందుకు? అనే హెడ్డింగ్ పెట్టారు. ఇందులో 12 ప్రశ్నాస్త్రాలు సంధించారు. వీటన్నింటికీ గౌరనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి అని స్పష్టం చేశారు.

Related posts

ఏపీలో పెరుగుతున్న పొలిటికల్ హీట్.. ఒకేసారి చంద్రబాబు, జగన్ ప్రచారం ప్రారంభం

Ram Narayana

టీడీపీని వీడి వైసీపీ పంచన చేరిన నలుగురు ఎమ్మెల్యేలకు నోటీసులు

Ram Narayana

టీడీపీలో చేరుతున్నా: వాసిరెడ్డి పద్మ…

Ram Narayana

Leave a Comment