Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నానో అక్కడే ఉన్న … పార్టీ మార్పు వార్తలపై ఎంపీ నామ

ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నానో అక్కడే ఉన్నాను …అని బీఆర్ యస్ లోకసభ పక్ష నేత ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు ఢిల్లీలో విలేకర్లకు తెలివైన సమాధానం ఇచ్చారు …ఇటీవల నామ పార్టీ మారుతున్నారని బీజేపీలో చేరి ఖమ్మం ఎంపీగా ఎన్డీయే కూటమి అభ్యర్థిగా పోటీచేయనున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో మీడియా ప్రతినిధులు ఆయన్ను ప్రశ్నించగా చిక్కాడు దొరకడులాగా సమాధానం ఇచ్చారు …అంతకు ముందు కవిత అరెస్టు పై నామ నాగేశ్వరరావు తన పార్టీ ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర , కే.ఆర్.సురేష్ రెడ్డి,మహబూబ్ నగర్ లోకసభ సభ్యులు మన్నె శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి మీడియాతో మాట్లాడారు. తమ పార్టీ నాయకురాలు కవితమ్మపై పెట్టిన లిక్కర్ కేసు అక్రమమని అన్నారు …ప్రభుత్వం లిక్కర్ పాలసీని తయారు చేసింది …దానిప్రకారం వ్యాపారం జరిగిందని అన్నారు …అయినప్పటికీ ఈకేసులో కవితకు ఎలాంటి స్వంబంధం లేదన్నారు …ఆలా అయితే కేంద్ర అనేక పాలసీలు తెచ్చింది ..వాటిలో మైనింగ్ , రోడ్స్ , ఎయిర్వేస్ ఉన్నాయి ప్రజల ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం కొన్ని పాలసీలు తెస్తుంది ..ఇందులో తప్పు ఏముందని నామ ప్రశ్నించారు …అయినప్పటికీ కేసు న్యాయపరిధిలో ఉన్నందున మాట్లాడకూడదని అన్నారు …కోర్టులపై తమకు నమ్మకం ఉందని తప్పకుండ న్యాయం జరుగుతుందనే విశ్వాసం వ్యక్తం చేశారు ..

కడిగిన ముత్యంలా కవిత బయటకు వస్తారు …రాజ్యసభ సభ్యులు వద్దిరాజు

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)తప్పుడు కేసు బనాయించి అక్రమంగా అరెస్టు చేసిందని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఆవేదన వ్యక్తం చేశారు.కేసును టీవీ సీరియల్స్ మాదిరిగా రెండేళ్లు సాగదీసి ఎన్నికల వేళ ఇప్పుడు తెరపైకి తెచ్చారని ఈడీ వైఖరిని ఆయన నిశితంగా ఎండగట్టారు.ఈడీ 2004 నుండి 2014 వరకు కేవలం 200 కేసులు మాత్రమే నమోదు చేస్తే, 2014 నుండి ఈ 10 సంవత్సరాలలో 2954 పైగా కేసులు పెట్టిందని వివరించారు.

ఈ కేసుతో అసలు కవితకు ఎటువంటి సంబంధం లేదని,ఆమె బాధితురాలు మాత్రమే కానీ నిందితురాలు కాదని ఆయన స్పష్టం చేశారు.న్యాయవ్యవస్థపై తమకు సంపూర్ణ విశ్వాసం ఉందని, ధర్మం తప్పకుండా గెలుస్తుందని,కడిగిన ముత్యం మాదిరిగా కవిత ఈ కేసును బయటకు వస్తారని ఎంపీ రవిచంద్ర అన్నారు.

Related posts

తెలంగాణలో 11 లోక్ సభ స్థానాలకు పరిశీలకులను నియమించిన కాంగ్రెస్!

Ram Narayana

ఓటు వేశాక ప్రెస్ మీట్ పెట్టిన రేవంత్ రెడ్డి…ఈసీకి రఘునందన్ రావు ఫిర్యాదు…

Ram Narayana

వ్యూహాత్మకంగానే కామారెడ్డిలో కేసీఆర్​ పోటీ..ఎమ్మెల్సీ కవిత

Ram Narayana

Leave a Comment