Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

వి హెచ్ కాంగ్రెస్ ను వీడను న్నారా ?

వి హెచ్ కాంగ్రెస్ ను వీడనున్నారా ? అందుకే కెసిఆర్ ను పొగిడారా ? అంటే వి హెచ్ అలాంటి పని చేస్తారా ? అనే సందేహం …. అందుకే పొగిడాడేమో అనే అనుమానం . టీ ఆర్ యస్ లో చేరితే వచ్చేది ఏముంది . ఇలాంటి చర్చలకు తావిచ్చింది వి హెచ్ వ్యవహారం . మొదటి నుంచి గట్టి కాంగ్రెస్ నాయకుడుగా ఉన్న వి . హనుమంతరావు రాష్ట్ర కాంగ్రెస్ లో పరిచయం అక్కరలేని వ్యక్తి . పార్టీలోని ఏనాయకుడినైనా విమర్శించటం ఆయన ప్రత్యేకత . అందుకే ఆయనకు కుప్పిగంతులు హనుమంతుడనే పేరుకూడా ఉంది . ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో వార్తలలో వ్యక్తిగా నిలిచారు . మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ని టీపీసీసీ అధ్యక్షుడుగా చేస్తే పార్టీని వీడేందుకు సైతం వెనకాడం అని, ఏఐసీసీ కి వార్నింగ్ కూడా ఇచ్చారు . అంతే కాకుండా రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జి మాణిక్యం ఠాకూర్ డబ్బుకు అమ్ముడు పోయి టీపీసీసీ పదవిని అమ్ముకున్నారని ఆరోపణలు చేశారు . హనుమంతరావు వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న అధిష్టానం ఆయనకు షోకాజ్ నోటిస్ జారీచేసింది . దీంతో ఆయన ఉన్నట్టు ఉండి కెసిఆర్ పైన రాష్ట్ర ప్రభుత్వ విధానాల పైన ప్రసంశలు కురిపించటం పలు విమర్శలకు దారితీస్తుంది . టీపీసీసీ అధ్యక్షుడుగా బి సి లకు ఇవ్వాలని అంటూనే కోమటిరెడ్డికి లేదా జగ్గారెడ్డికి ఇస్తే తప్పు ఏమిటని ద్వంద విధానాలు అవలంభిస్తుంటారు . గతంలో హైకమాండుకు దగ్గరగా ఉంటూనే తనకు వీలు చిక్కినప్పుడల్లా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులపై ఫిర్యాదులు చేయటం తన అలవాటుగా పెట్టుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి . సీనియర్ కాంగ్రెస్ నాయకుడుగా ఉన్నా వి హెచ్ ను హైకమాండు గుర్తించి మూడుసార్లు రాజ్యసభకు ఎంపిక చేసింది . గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడుగా ఆయన్ను చెప్పుకుంటారు . ఉమ్మడి ఆంధ్ర ప్రదేశంలో పీసీసీ అద్యక్షడుగా పనిచేశారు . దివంగ ముఖ్యమంత్రి వై యస్ రాజశేఖర్ రెడ్డి కి బద్ద వ్యతిరేకిగా ముద్ర పడిన నేత . రాజశేఖరరెడ్డి వల్లనే తనకు కేంద్రంలోను రాష్ట్రంలో మంత్రి పదవి రాలేదనే అభిప్రాయం ఆయనలో బలంగా ఉంది . వై .యస్ మరణానంతరం ఆయన తనయిడు ముఖ్యమంత్రి కావాలని ఎమ్మెల్యేలు కోరినప్పుడు ఆయన వద్దని చెప్పిన వాళ్లలో వి హెచ్ కూడా ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి . తెలంగాణ విషయంలో కూడా కొంత మంది అదేపనిగా సోనియా చెవిలో జోరీగా ల చేరి తప్పుడు సలహాలు ఇచ్చారని కాంగ్రెస్ లోనే కొంత మంది చెబుతుంటారు . తెలంగాణ ఇచ్చి నప్పటికీ అది కాంగ్రెస్ ఖాతాలోకి రాకుండా దాన్ని సొమ్ము చేసుకోకుండా ఉన్నారని అలాంటి వారిలో వి హెచ్ ఒకరినే అభిప్రాయాలూ ఉన్నాయి . తెలంగాణాలో కాంగ్రెస్ చాల బలహీన పడింది . దాన్ని గాడిలో పట్టేందుకు కసరత్తు జరుగు తున్న తరుణంలో వి హెచ్ అసంబద్ధమైన వాదనలు ముందుకు తెస్తూ పార్టీకి నష్టం చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. కాంగ్రెస్అధ్యక్షుడి నియామకంలో పార్టీ అధిష్టానానికి వ్యతిరేకంగా , రాష్ట్ర ఇంచార్జి మాణిక్యం ఠాకూర్ కు వ్యతిరేకంగా బహిరంగ విమర్శలు చేసిన వి హెచ్ చర్యలపై కొంతమంది ఆగ్రహం గా ఉన్నారని , ఆయనకు కొంతమంది ఫోన్లు చేసి చంపుతామని బెదిరిస్తున్నారని రాష్ట్ర డి జి పికి కూడా ఫిర్యాదు చేశారు . రేవంత్ అయితే పార్టీని వీడతానని బహిరంగంగానే చెప్పటం , కెసిఆర్ ను పొగడటం దేనికి సంకేతమని కొందరు కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్నారు . ఇప్పటికైనా వి హెచ్ నిజస్వరూపాన్ని అర్థం చేసుకోవాలని వారు కోరుతున్నారు . చూద్దాం ఏమి జరుగుతుందో !!!!

Related posts

బిజెపిలో చేరికలు ప్రోత్సహిస్తాం : కొండా విశ్వేశ్వర్ రెడ్డి!

Drukpadam

చేతులెత్తేసిన ప్రతిపక్షాలు.. నేపాల్ ప్రధానిగా మళ్లీ ఓలి!

Drukpadam

ఢిల్లీలో జగన్ బిజీ షడ్యుల్:కేంద్ర మంత్రులతో వరస భేటీలు …

Drukpadam

Leave a Comment