Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

ఇంకా నిర్ణయంకాని ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి …

ఇప్పుడు కాంగ్రెస్ లో ఖమ్మం లోకసభ సీటుకు అభ్యర్థిని ఎంపిక చేయడం అధిష్టానానికి కత్తిమీదసాములాగా మారింది …దీంతో తెలంగాణాలో అన్ని ఉన్న 17 లోకసభ స్థానాల్లో 16 స్థానాలకు అభ్యర్థుల ఎంపిక జరిగిన ఖమ్మం సీటు పెండింగ్ లో ఉంది …మంత్రుల కుటుంబసభ్యులకు టికెట్ కావాలని పట్టుబట్టడంతో ఒకరి ఇస్తే మరొకరికి కోపం వస్తుందని
అభ్యర్థి ఎంపికలో కాంగ్రెస్ అధిష్టానం ఎటూతేల్చుకోలేక పోతుంది … తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న నాలుగు ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసేందుకు సోమవారం ఢిల్లీలో సమావేశమైన కాంగ్రెస్ ఎన్నికల కమిటీ ఒక్క ఖమ్మం మినహా మిగతా మూడు స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసినట్లు సమాచారం …ఖమ్మం విషయంలో మల్లు నందిని ,పొంగులేటి ప్రసాద్ రెడ్డి లమధ్య తీవ్ర పోటీ నెలకొనడం, ఇద్దరు కీలక మంత్రులు మధ్య అగ్గి రాజేసే అవకాశం ఉండటంతో ఎవరికీ సీటు ఇవ్వాలనే దానిపై మల్ల గుల్లాలు పడుతున్నారు. మంత్రుల మధ్య నెలకొన్న పట్టింపులు అధిష్టానానికి తలనొప్పిగా మారినట్లు తెలుస్తుంది…ఒక సందర్భంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు తుమ్మల యుగంధర్ కూడా రంగంలో ఉండటం వారి సామజిక వర్గానికి టికెట్ కావాలనే వత్తిడి నేపథ్యంలో పార్టీ మొగ్గు చూపినట్లు ప్రచారం జరిగింది …వంకాయలపాటి రాజా కూడా తనకున్న పరిచయాల ద్వారా తన పేరు సిఫార్స్ చేయించుకున్నారు .. జట్టి కుసుమ కుమార్ కూడా ఖమ్మంలో పోటీ చేసేందుకు ఆసక్తి చూపారు .. అయితే కమ్మ సామజిక వర్గానికి చెందిన మాజీ కేంద్రమంత్రి రేణుక చౌదరి కి రాజ్యసభ సీటు ఇవ్వడంతో తిరిగి ఖమ్మం సీటు మరో సామజిక వర్గానికి ఇచ్చేందుకు అధిష్టానం నిర్ణయించుకుందని సమాచారం … దీంతో మల్లు నందిని , పొంగులేటి ప్రసాద్ రెడ్డి ల మధ్య ఎవరికీ ఇవ్వాలనే విషయం తేల్చాల్సిఉంది …

ఖమ్మం సీటు ఎంపిక ఇప్పటికే రెండు మూడు సార్లు వాయిదా పడటంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రియాంక గాంధీని ఖమ్మంకు ఆహ్వానించినట్లు తెలుస్తుంది …ప్రియాంక ఖమ్మంలో పోటీచేసేందుకు అంగీకరిస్తే తమకు ఎలాంటి తలనొప్పులు ఉండవని అందరు కలిసి కట్టుగా పనిచేస్తారని అందువల్ల అధిష్టానం ఆదిశగా ఆలోచనలు చేయాలనీ సీఎం రేవంత్ రెడ్డి సైతం కోరినట్లు తెలుస్తుంది…అయితే ప్రియాంక గాంధీ ఖమ్మంలో పోటీచేసేందుకు అంగీకరిస్తుందా లేదా అనే సందేహాలు ఉన్నాయి…

బీఆర్ యస్ , బీజేపీ లు తమ అభ్యర్థులను ప్రకటించి ప్రచార రంగంలోకి దినప్పటికీ కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికలో జరుగుతున్న జాప్యంపై కాంగ్రెస్ శ్రేణులు సైతం నిరాశతో ఉన్నాయి…అధికారంలో ఉన్న అభ్యర్థి ఎంపిక పై ఎదురు చూపులు తప్పడంలేదని అంటున్నారు …

Related posts

పార్టీ విజయం కోసం కష్టపడిన ఏ కార్యకర్తని బిఆర్ఎస్ పార్టీ మర్చిపోదు..నామ ,వద్దిరాజు

Ram Narayana

ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై ఆటోవాలాల దాడి

Ram Narayana

జిల్లాలో మంత్రులు ,తుమ్మల , పొంగులేటి పర్యటనలు

Ram Narayana

Leave a Comment