“వన్ వహికల్.. వన్ ఫాస్టాగ్” రూల్ అమల్లోకి వచ్చేసింది..
ప్రస్తుతం 8 కోట్ల మంది ఫాస్టాగ్ వినియోగదారులు ఉన్నారు
ఏప్రిల్ 1 నుంచి వన్ వెహికల్.. వన్ ఫాస్టాగ్ విధానం దేశ వ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. దీనితో ఒక ఫాస్టాగ్ ను పలు వాహనాలకు వాడటం లేదా ఒక వాహనానికి పలు ఫాస్టాగ్లు వాడటం ఇక నుంచి కుదరదు.
పేటీఎం పేమెంట్స్ బ్యాంకుపై ఆంక్షలు నేపథ్యంలో వినియోగదారుల సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఈ నిబంధనల అమలు గడువును మార్చి 31వ తేదీ వరకు NHAI పొడిగించిన సంగతి అందరికీ తెలిసిందే.