Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
పార్లమంట్ న్యూస్ ...

రాజ్యసభ సభ్యురాలిగా సోనియాగాంధీ ప్రమాణ స్వీకారం …

  • రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన సోనియా
  • మన్మోహన్ పదవీకాలం ముగియడంతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానం
  • సోనియాతో ప్రమాణం చేయించిన రాజ్యసభ ఛైర్మన్ జగ్దీప్ ధన్కర్

కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ రాజ్యసభ సభ్యురాలిగా ప్రమాణస్వీకారం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగ్దీప్ ధన్కర్ ఆమె చేత ప్రమాణం చేయించారు. ఇప్పటి వరకు లోక్ సభకు ప్రాతినిధ్యం వహించిన సోనియా… తొలిసారి రాజ్యసభలో అడుగుపెట్టారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభ పదవీకాలం ముగియడంతో ఆయన స్థానంలో సోనియా పోటీ చేశారు. నిన్నటితో మన్మోహన్ పదవీకాలం ముగిసింది. రాజస్థాన్ నుంచి సోనియా పోటీ చేశారు. సోనియాతో పాటు రాజ్యసభకు ఎన్నికైన 12 మంది ఈరోజు ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన వారిలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా ఉన్నారు. ఆయన ఒడిశా నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు.

రాజ్యసభ సభ్యులుగా ప్రమాణస్వీకారం చేసిన ముగ్గురు వైసీపీ నేతలు

3 YSRCP Rajya Sabha members takes oath

కొత్తగా ఎన్నికైన ముగ్గురు వైసీపీ రాజ్యసభ సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబూరావు, మేడా రఘునాథ్ రెడ్డిలతో ఉప రాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగ్దీప్ ధన్కడ్ ప్రమాణం చేయించారు. వీరిలో వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాథ్ రెడ్డి ఇంగ్లీష్ లో ప్రమాణం చేయగా… గొల్ల బాబూరావు హిందీలో ప్రమాణం చేశారు. కొత్త సభ్యులతో కలిపి ప్రస్తుతం రాజ్యసభలో వైసీపీ సభ్యుల సంఖ్య 11కు చేరుకుంది. ఈ క్రమంలో రాజ్యసభలో నాలుగో పెద్ద పార్టీగా వైసీపీ అవతరించింది. 97 మంది రాజ్యసభ సభ్యులతో బీజేపీ అగ్ర స్థానంలో ఉండగా… 29 మంది సభ్యులతో కాంగ్రెస్, 13 మంది సభ్యులతో టీఎంసీ రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. 

ప్రమాణస్వీకారానికి ముందు మీడియాతో గొల్ల బాబూరావు మాట్లాడుతూ… ముఖ్యమంత్రి జగన్ రాజ్యసభలో దళితులకు అవకాశం కల్పించారని అన్నారు. సామాజిక న్యాయానికి జగన్ పెద్దపీట వేశారని కొనియాడారు. పేదల సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.

వద్దిరాజు ప్రమాణస్వీకారం

రాజ్యసభ సభ్యులుగా రెండవ సారి ఏకగ్రీవంగా ఎన్నికైన వద్దిరాజు రవిచంద్ర ప్రమాణస్వీకారం చేశారు.పార్లమెంట్ ప్రాంగణంలో గురువారం ఉదయం ఆయన చేత ఉప రాష్ట్రపతి,రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధనఖర్ ప్రమాణం చేయించారు.ఈ సందర్భంగా ఛైర్మన్ ధనఖర్,పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి పీయూష్ గోయల్, రాజ్యసభ సభ్యులు పలువురు రవిచంద్రకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

Related posts

కలత చెందిన లోక్ సభ స్పీకర్.. ఇక సభకు హాజరుకానన్న ఓంబిర్లా!

Ram Narayana

మణిపూర్ లో భారత మాతను చంపేశారు.. లోక్ సభలో రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు

Ram Narayana

తృణమూల్ ఎంపీ మహువా మొయిత్రాపై పార్లమెంటు నుంచి బహిష్కరణ వేటు

Ram Narayana

Leave a Comment