Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటనలో జాప్యం …పార్టీకి నష్టం జరిగే అవకాశం !

ఖమ్మం కాంగ్రెస్ లోకసభ అభ్యర్థి ఎన్నికల్లో జాప్యం పార్టీకి నష్టం జరుగుతుందనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి…వచ్చేనెల 13 న ఎన్నిక జరగనుండగా రాష్ట్రంలోని 16 లోకసభ సీట్లకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానం ఖమ్మం సీటుకు అభ్యర్థి ఎంపికలో వెనకడుగు వేస్తుంది …

ఇప్పటివరకు ఖమ్మం లోక్సభ అభ్యర్థి ని కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు ప్రకటించలేదు కారణం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు తమ కుటుంబ సభ్యులకే టికెట్ ఇవ్వాలని పట్టుబట్టడంతో అధిష్టానం పెద్దలు ఈ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు మంత్రుల కుటుంబసభ్యులకు ఇచ్చి కొత్త పంచాయతీ కొని తెచ్చుకోవడం ఎందుకని అధిష్టానం భావనగా ఉందని సమాచారం … దీంతో మంత్రుల కుటుంబ సభ్యులను ఎంపిక చేయకుండా వేరేవాళ్లకు అవకాశం ఇయ్యటం ద్వారా ఖమ్మం సీట్లు గెలవాలని కాంగ్రెస్ పార్టీ గట్టి పట్టుదలతో ఉంది … అందుకు అనుగుణంగా వ్యూహాత్మక అడుగులు వేస్తుంది … జిల్లాకు చెందిన మంత్రులు మాత్రం తమవారికి ఇవ్వాలని పార్టీ అధిష్టానం పెద్దలను కన్విన్స్ చేసే పనిలో నిమగ్నమైయ్యారు … కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న జాప్యం కారణంగా అభ్యర్థి ఎంపిక జరిగి ప్రజల్లోకి వెళ్లడం కొంత ఇబ్బందికరంగా ఉంటుందనే అభిప్రాయాలూ ఉన్నాయి… ఇప్పటివరకు అభ్యర్థిని ఎంపిక చేయకపోవడం ఒక తప్పిదమైతే… ఎవరికి ఇవ్వాలి అనే విషయంలో కూడా స్పష్టత లేకపోవడం పార్టీ గెలుపు అవకాశాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది …

ఖమ్మం లోకసభకు బీఆర్ యస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న నామ నాగేశ్వరరావు పాత కాపే అయినా ఏప్రిల్ నెల ప్రారంభం నుంచి నియోజకవర్గాలను చుట్టి వస్తున్నారు …ఇక బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు బీఆర్ యస్ అభ్యర్థి కన్నా ముందే ప్రచారంలో ఉన్నారు …కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నామనే దీమాతోపాటు జిల్లాలోని ఖమ్మం పార్లమెంట్ పరిధిలో ముగ్గురు మంత్రులు ఉండటం తమకు అనుకూలంగా ఉంటుందనే అభిప్రాయంతో ఉంది …అయితే గత లోకసభ ఎన్నికల్లో బీఆర్ యస్ అధికారంలోకి వచ్చిన కొద్దీ నెలల్లో జరిగిన ఎన్నికల్లో కారు పార్టీకి ఘోర పరాభవం జరిగిన విషయాన్నీ మర్చి పోవద్దని రాజకీయ పరిశీలకులు హెచ్చరిస్తున్నారు …అదే సందర్భంలో జిల్లాకు ఎలాంటి సంబంధం లేని వ్యక్తులను కాంగ్రెస్ పార్టీ పోటీలో నిలిపితే బీఆర్ యస్ అభ్యర్థి నామ కు అడ్వాంటేజ్ అయ్యే అవకాశాలను తోసి పుచ్చలేమని అంటున్నారు పరిశీలకులు …

నిన్నమొన్నటివరకు తమకే టికెట్ వస్తుందని బలంగా బల్లగుద్దిన నేతలు అధిష్టానం సంకేతాలతో డీలా పడ్డారు … మంత్రి పొంగులేటి సోదరుడు ప్రసాద్ రెడ్డికి , డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందినికి మధ్య ఎవరికీ ఇవ్వాలనే దానిపై వార్ నడుస్తుందని ,మంత్రి తుమ్మల తనయుడు యుగంధర్ కూడా గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడని ప్రచారం జరుగుతున్నా అధిష్టానం మాత్రం ఖమ్మం లోకసభకు అభ్యర్థి ఎంపికలో జాప్యం చేయడంపై కార్యకర్తలు సైతం నిరాశకు గురవుతున్నారు … అధిష్టానం మంత్రుల కుటుంబసభ్యులకు నో టికెట్ అని అన్నదన్న వస్తున్న వార్తల నేపథ్యంలో ఖమ్మానికి చెందిన రాయల నాగేశ్వరరావు , వంకాయపాటి రాజేంద్ర ప్రసాద్ , మాజీ ఎమ్మెల్సీలు పోట్ల నాగేశ్వరరావు ,బాలసాని లక్ష్మీనారాయణ , మాజీ డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయబాబు , మహమ్మద్ జావీద్ లు తాము మాత్రం తక్కువ అని అంటున్నారు …వీరు గాక కాంగ్రెస్ రాష్ట్ర నేత జట్టి కుసుమ కుమార్ , నందమూరి సుహాషిణి పేర్లు కూడా చక్కర్లు కొడుతున్నాయి…సీనియర్ కాంగ్రెస్ నేత వి .హనుమంతరావు సైతం తమకు ఖమ్మం సీటు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కోరారు . ఎవరిని ఎంపిక చేసినప్పటికీ తొందరగా చేయకుండా మరింత ఆలస్యం చేస్తే మూల్యం చెల్లించుకోక తప్పదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి….మరి కాంగ్రెస్ పార్టీ ఏమి చేస్తుందో చూద్దాం ….!

Related posts

చీఫ్ సెక్రెటరీకి నారా చంద్రబాబు నాయుడు లేఖ!

Drukpadam

ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికల నిర్వహణ లక్ష్యం: పోలీస్ కమిషనర్!

Drukpadam

నైతిక విజయం కాంగ్రెస్ దే.!ఎమ్మెల్సీ ఫలితంపై జగ్గారెడ్డి స్పందన.!

Drukpadam

Leave a Comment