Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

తెలుగు ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి ఉగాది శుభాకాంక్షలు

  • శ్రీ క్రోధి నామ తెలుగు సంవత్సరంలో ప్రజలకు శుభం కలగాలన్న ముఖ్యమంత్రి
  • ప్రజల ఆశలు, ఆంక్షలు నెరవేరాలన్న ముఖ్యమంత్రి
  • కొత్త ఏడాదిలో కాలం కలిసి రావాలని, వానలు సమృద్ధిగా కురిసి, రైతుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరియాలన్న సీఎం

తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలుగు సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ క్రోధి నామ తెలుగు సంవత్సరం ప్రారంభం కాబోతున్న సందర్భంగా… కొత్త సంవత్సరంలో ప్రజలకు శుభం కలగాలని, ప్రజల ఆశలు, ఆంక్షలు నెరవేరాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. కొత్త ఏడాదిలో కాలం కలిసి రావాలని, వానలు సమృద్ధిగా కురిసి, రైతుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరియాలన్నారు.

నూతన సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో మెరుగైన అభివృద్ధి సాధించి, దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మన సంస్కృతి సంప్రదాయాలు చాటిచెప్పేలా ఉగాది పండుగను సంతోషంగా జరుపుకోవాలని కోరారు. తెలుగు ప్రజలకు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. 

ఉపముఖ్యమంత్రి శుభాకాంక్షలు

ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికి క్రోధినామ సంవత్సరాది సందర్భంగా భ‌ట్టివిక్ర‌మార్క శుభాకాంక్షలు తెలిపారు.  ఉగాది పండుగ ప్ర‌జ‌లంద‌రికీ స‌క‌ల శుభాల‌ను పంచాల‌న్నారు. ప్ర‌జ‌ల జీవితాల్లో సుఖ శాంతులు తేవాల‌ని,  క‌ష్టాలు, నష్టాలు తొల‌గి ఆనంద‌మ‌య జీవితాల‌కు ఈ పండుగ నాంది కావాల‌ని ఆకాంక్షించారు.

షడ్రుచుల సమ్మేళనంతో ప్రారంభమయ్యే ఉగాది.. తెలుగు లోగిళ్లలో నూతన సంవత్సర శోభను తెస్తూ, కొత్త లక్ష్యాలకు, కొత్త ఆలోచనలకు, ప్రతి ఒక్కరి ఉజ్వల భవిష్యత్తుకు, తద్వారా రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దోహదపడాలన్నారు. ఇందిర‌మ్మ రాజ్యంలోని కాంగ్రెస్ ప్ర‌జాప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న గ్యారంటీల వ‌ల్ల ల‌బ్ధి పొందుతున్న‌ ప్ర‌జ‌ల జీవితాల్లో ఆనందాలు నిండాల‌న్నారు. ఈ క్రోధి నామ సంవత్సరంలో ఇంటింటా ఆయురారోగ్యాలు, సిరిసంపదలు, ఆనందాలు నిండాలని అభిలాషించారు. ఈ క్రోధినామ సంవ‌త్స‌రంలో  స‌మృద్ధిగా వ‌ర్షాలు కురువాల‌ని, పంట‌లు బాగా పండాల‌ని, రైతులు బాగుండాల‌ని, స‌క‌లవృత్తుల వారు ఆనందంగా ఉండాల‌న్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వం ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భ‌ర్తీ చేయ‌డానికి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసినందున నిరుద్యోగుల‌కు ఈ ఏడాది ఉద్యోగ నామ సంవ‌త్స‌రం కావాల‌న్నారు.

Related posts

ఖమ్మంలో జరగనున్న టీయూడబ్ల్యూజే రాష్ట్ర మహాసభలను చరిత్రలో నిలిచిపోవాలి …విరాహత్ అలీ

Ram Narayana

టీఎస్ ఎప్‌సెట్-2024 ఫ‌లితాల విడుద‌ల‌…

Ram Narayana

తెలంగాణ డీజీపీగా సీనియర్ ఐపీఎస్ జితేందర్ నియామకం…

Ram Narayana

Leave a Comment