Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

ఖమ్మం నుంచి కాంగ్రెస్ లోకసభ అభ్యర్థి రాయల నా … ?మండన నా …?

ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఎంపిక విషయం రోజుకొక మలుపు పూటకొక పేరుతో తలనొప్పిగా తయారైంది …ఇంతకీ ఖమ్మం లోకసభ సీటు కమ్మ సామాజికవర్గణం నుంచే ఇస్తారా …అయితే ఎవరు స్థానికుడైన రాయల నా ..? మాజీమంత్రి మండవ నా …?అనేదానిపై జిల్లాలో రసవత్తర చర్చ జరుగుతుంది …స్థానికేతరుడిని ఎంపిక చేస్తారని వస్తున్నా వార్తల నేపథ్యంలో కార్యకర్తలు పెదవి విరుస్తున్నారు …మంత్రుల కుటుంబసభ్యుల్లో ఒకరికి ఇస్తే మరొకరితో ఇబ్బందులు ఉంటాయని భావించిన అధిష్టానం వారికీ టికెట్ ఇవ్వడంలేదని స్పష్టం చేసింది … జిల్లాకు చెందిన మంత్రులు వారి కుటుంబసభ్యులు కాకుండా వేరే పేర్లు సూచించాలని చెప్పడంతో ఏమి పాలుపోని పరిస్థితిలో మంత్రులు ఉన్నారు …

స్థానికులు కాకుండా స్థానికేతరుల పేర్లు ప్రచారంలోకి రావడంతో పార్టీకి ఇబ్బందులను కొని
తెచ్చి పెట్టె అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి …ఈనెల 12 వ తేదీన అభ్యర్థి ఎంపిక ఖరారు అవుతుందని అందువల్ల ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై రాష్ట్ర పార్టీ స్పీడ్ పెంచింది …ఇక జిల్లాకు చెందిన మంత్రుల మాట కూడా కీలకం కానుండటంతో ఆశావహులు వారి చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు … గత ఎన్నికల్లో పాలేరు టికెట్ ఆశించి చేజారిన రాయల నాగేశ్వరరావు తనకు ఖమ్మం ఎంపీ సీటు ఇవ్వాలని గట్టిగా కోరుతున్నారు …ఈవిషయమై ఇప్పటికే జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ను , మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు , పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలకు కలిసి విజ్ఞప్తి చేసినట్లు సమాచారం … వారు ఆయన మాటలు విన్నప్పటికి స్పష్టమైన హామీ ఇవ్వలేదని తెలుస్తుంది … మాజీమంత్రి నిజామాబాద్ జిల్లాకు చెందిన మండవ వెంకటేశ్వరరావు కొత్తగా పేరు చేరింది … ఈయనకు మంత్రి తుమ్మలతో మంచి స్నేహసంబంధాలు ఉన్నాయి .. జిల్లాలో కార్యకర్తల మాత్రం స్థానికులకే టికెట్ ఇవ్వాలనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు …జిల్లాలో పోటీచేసే వారు ,లోకసభకు వెళ్లే అర్హత ఉన్నవాళ్లు చాలామంది ఉన్నారని అలాంటి వారిని ఎంపిక చేయాలనే కానీ బయటవారిని తేవడం ఏమిటనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఆశించిన సీట్లు వేరే వారికీ ఇచ్చినప్పటికీ పార్టీ అధికారంలోకి రావాలనే సదుద్దేశంతో టిక్కెట్లను త్యాగం చేసినవారి పేర్లు పరిశీలించాలని డిమాండ్ ముందుకు వస్తుంది …కాంగ్రెస్ అధికారంలో లేనప్పుడు కష్టకాలంలో ఆయా నియోజకవర్గాలలో పార్టీని కాపాడుకుంటూవచ్చిన వారికీ టికెట్ ఇవ్వాలనే కార్యకర్తలు కోరుతున్నారు ..

జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు మూడు దారులుగా ఉండటంతో టికెట్ ఎవరికీ ఇవ్వాలనే దానిపై అధిష్టానం మల్లగుల్లాలు పడుతుంది …ఒక సందర్భంలో మంత్రి పొంగులేటి సోదరుడు ప్రసాద్ రెడ్డికి టికెట్ కన్ఫామ్ అయిందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది ..మరో సందర్భంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి నందినికి ఇచ్చారని సోషల్ మీడియా లో ట్రోలు అయింది … సామాజిక సమీకరణాల్లో భాగంగా ఖమ్మం నుంచి కమ్మ సామాజిక వర్గానికి చెందిన మంత్రి తుమ్మల తనయుడు డాక్టర్ యుగంధర్ కు వస్తుందని ప్రచారం జరిగింది …మరో పక్క కమ్మ సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త బజాజ్ సంస్థల తెలంగాణ డీలర్ గా ఉన్న వంకాయలపాటి రాజేంద్రప్రసాద్ ఏఐసీసీ లో తనకున్న పరిచయాల ద్వారా టికెట్ తెచ్చుకుంటున్నారని వార్తలు వచ్చాయి… జట్టి కుసుమ కుమార్ , వి .హమాంతరావు లు ఖమ్మం టికెట్ ఆశించారు …గత ఎన్నికల్లో ఖమ్మం టికెట్ ఆశించిన మహమ్మద్ జావేద్ కు టికెట్ ఇవ్వాలని ఇటీవల ఆయన అనుయాయిలు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడి వద్ద డిమాండ్ చేశారు …జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీలు పోట్ల నాగేశ్వరరావు , బాలసాని లక్ష్మీనారాయణ , మాజీ డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్ బాబు లాంటి వారు ఉన్నారు ..జిల్లాలో ఇంతమంది నాయకులూ ఉండగా బయటివారికి టికెట్ ఇవ్వడం ఏమిటనే అభిప్రాయాలూ ఉన్నాయి …

ఎన్నికలు నెత్తిమీదకు వచ్చాయి…మరో వారం రోజుల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది … ప్రచారానికి అతి తక్కువ సమయం ఉంటుంది … కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపికలో మీకామేషాలు లెక్కపెడుతుంది …దీంతో సులభంగా గెలిచే సీటు కష్టాల వైపు నెట్టివేయబడుతుంది …అభ్యర్థి ఎంపిక జాప్యం కారణంగా నష్టం జరిగే అవకాశం ఉంది … ఖమ్మం సీటు ఓడిపోతే జిల్లాకు చెందిన మంత్రుల ప్రతిష్ట మసకబారుతుంది …

Related posts

బండి సంజయ్ మాటల వెనక మర్మమేంటి …?

Ram Narayana

అవినీతికి పాల్పడిన వారిపై విచారణ జరిపి జైలుకు పంపిస్తాం: జనగామలో అమిత్ షా

Ram Narayana

రేపు లేదా ఎల్లుండి మిగతా అభ్యర్థుల జాబితా: కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ

Ram Narayana

Leave a Comment