Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

మెప్పు కోసం రేవంత్ రెడ్డి చిల్లర పనులను ప్రోత్సహిస్తున్నారు: ఈటల రాజేందర్!

  • బీజేపీ కార్యాలయంపై దాడి ఘటనకు ప్రభుత్వం బాధ్యత వహించాలన్న ఈటల
  • సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్
  • తెలంగాణలోని ప్రతి గడపలో సీఎంను దూషించే పరిస్థితి నెలకొందన్న ఎంపీ

బీజేపీ కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ దాడి ఘటనకు ప్రభుత్వం బాధ్యత వహించాలని, సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం మెప్పు కోసం రేవంత్ రెడ్డి చిల్లర పనులను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలు అంతా గమనిస్తున్నారన్నారు.

ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణలోని ప్రతి గడపలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని దూషించే పరిస్థితి ఉందన్నారు. అతి తక్కువ సమయంలో ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కొన్న ప్రభుత్వం ఇదే అన్నారు. కాంగ్రెస్ పాలనతో ప్రజలు అప్పుడే నిరసనలు, ఆందోళనలు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ శ్రేణులు కార్యాలయాలపై దాడులు చేస్తుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని ఆరోపించారు.

చర్లపల్లి టెర్మినల్ ప్రారంభోత్సవానికి వర్చువల్‌గా హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, ఆరాంఘర్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి మాత్రం స్వయంగా వెళ్లడంతో పాటు తన పక్కన ఒవైసీ సోదరులను పెట్టుకొని వెకిలి మాటలు మాట్లాడారని మండిపడ్డారు. గతంలో ప్రధాని మోదీపై, బీజేపీపై మాట్లాడిన బీఆర్ఎస్ ఏమైందో గుర్తుంచుకోవాలన్నారు. కాంగ్రెస్ వెకిలిచేష్టలకు మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు.

Related posts

తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు కసరత్తు …మరో ఆరుగురు మంత్రులు !

Ram Narayana

ప్లాష్ ..ప్లాష్ … రేపే సోనియా సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్న తుమ్మల…..

Ram Narayana

అన్యాయం జరిగింది.. కానీ పార్టీ కోసం ఉపసంహరించుకున్నా: పటేల్ రమేశ్ రెడ్డి కంటతడి

Ram Narayana

Leave a Comment