Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పోతిన మహేశ్…

  • విజయవాడ వెస్ట్ సీటును ఆశించి భంగపడ్డ పోతిన
  • పొత్తులో భాగంగా అక్కడి నుంచి పోటీ చేస్తున్న బీజేపీ
  • జనసేనకు గుడ్ బై చెప్పి.. వైసీపీలో చేరిన పోతిన

రెండు రోజుల క్రితం జనసేన పార్టీకి రాజీనామా చేసిన పోతిన మహేశ్ వైసీపీలో చేరారు. సీఎం జగన్ సమక్షంలో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా పోతిన అనుచరులు కూడా వైసీపీలో చేరారు. వీరందరికీ జగన్ పార్టీ కండువా కప్పి వైసీపీలోకి ఆహ్వానించారు. 

విజయవాడ వెస్ట్ నుంచి జనసేన టికెట్ ను పోతిన ఆశించి భంగపడ్డారు. పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని బీజేపీ తీసుకుంది. ఈ స్థానం నుంచి బీజేపీ తరపున రాజ్యసభ మాజీ సభ్యుడు సుజనా చౌదరి బరిలోకి దిగారు. ఈ నేపథ్యంలో, తీవ్ర అసంతృప్తికి గురైన పోతిన జనసేనకు గుడ్ బై చెప్పారు. 

జనసేనానని పవన్ కల్యాణ్ పై పోతిన తీవ్ర విమర్శలు గుప్పించారు. నాయకుడంటే నమ్మకం అని… భరోసా ఇచ్చేవాడు, భవిష్యత్తు మీద భద్రత కల్పించేవాడే నాయకుడని ఆయన అన్నారు. పవన్ కు సొంత పార్టీ జెండాపై ప్రేమ లేదని, ఇతర పార్టీల జెండాలు మోయాలనుకుంటున్నారని విమర్శించారు. మాట ఇస్తే మడమ తిప్పని నాయకుడు ఎవరో అందరికీ తెలుసని… తాను ఆయన వైపు అడుగులు వేస్తానని పరోక్షంగా జగన్ ను ఉద్దేశించి అన్నారు. ఆయన చెప్పినట్టుగానే ఈరోజు జనసేనలో చేరారు

Related posts

 జగన్ వాటిని కూడా తప్పుబడుతున్నాడు: అచ్చెన్నాయుడు

Ram Narayana

అధైర్యపడొద్దు… పార్టీ మీ వెన్నంటే ఉంది: మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలకు భువనేశ్వరి భరోసా

Ram Narayana

తెలుగు ప్రజలకు చంద్రబాబు బహిరంగ లేఖ

Ram Narayana

Leave a Comment