Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోర్ట్ తీర్పులు

కవితకు మూడ్రోజుల సీబీఐ కస్టడీకి కోర్టు అనుమతి…

  • ఢిల్లీ మద్యం కేసులో కవిత కీలకమని కస్టడీ పిటిషన్‌లో పేర్కొన్న సీబీఐ
  • ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరిన సీబీఐ
  • రేపటి నుంచి మూడురోజుల కస్టడీ 

ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సీబీఐ కస్టడీకి రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు అనుమతి ఇచ్చింది. సీబీఐ ఐదు రోజుల కస్టడీని కోరగా… మూడు రోజుల కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. రేపటి నుంచి ఈ నెల 15 వరకు సీబీఐ కస్టడీలోకి తీసుకొని కవితను విచారించనుంది.

కవిత కస్టడీ పిటిషన్‌లో కీలక అంశాలు

మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ కస్టడీ పిటిషన్ దాఖలు చేసిన సీబీఐ… అందులో కీలక అంశాలు పేర్కొంది. కవితను ఐదు రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని సీబీఐ కోరింది. మద్యం కేసులో కవిత చాలా కీలకమని, ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.100 కోట్లు చెల్లించారని సీబీఐ కస్టడీ పిటిషన్‌లో పేర్కొంది. జాగృతి సంస్థకు శరత్ చంద్రారెడ్డి రూ.80 లక్షల ముడుపులు ఇచ్చారని తెలిపింది. డబ్బుల కోసం శరత్ చంద్రారెడ్డిని కవిత బెదిరించినట్లు అందులో పేర్కొంది. సీబీఐ 11 పేజీలతో ఈ కస్టడీ పిటిషన్‌ను దాఖలు చేసింది.

అంతకు ముందు

 కవితకు చుక్కెదురు.. సీబీఐ అరెస్ట్ ని సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ కొట్టివేత

Delhi Court dismesses two petitions of Kavitha

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో చుక్కెదురయింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తనను సీబీఐ అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ ఆమె రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై వాదనలు విన్న కోర్టు ఆమె పిటిషన్లను కొట్టి వేసింది. తనను అరెస్ట్ చేయడం, తనను ప్రశ్నించడం రెండు అంశాలపై ఆమె రెండు పిటిషన్లు వేశారు. ఈ రెండు పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. మరోవైపు, కవితను ఐదు రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలనే పిటిషన్ పై కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. తరవాత కోర్ట్ కవిత పిటిషన్లు కొట్టి వేస్తూ సిబిఐ కోరిన విధంగా ఐదు రోజులు కాకుండా మూడు రోజుల కస్టడీకి అనుమతి నిచ్చింది …

Related posts

16-18 ఏళ్ల వారిమధ్య పరస్పర అంగీకారంతో జరిగే శృంగారంపై మీ అభిప్రాయం ఏమిటి?: కేంద్రానికి సుప్రీంకోర్టు ప్రశ్న

Ram Narayana

ఏపీ రాజధాని తరలింపుపై పిటిషన్… హైకోర్టు ఏమన్నదంటే…!

Ram Narayana

లిక్కర్ కేసులో కల్వకుంట్ల కవితకు రిమాండ్ … తీహార్ జైలుకు తరలింపు

Ram Narayana

Leave a Comment