కోర్ట్ తీర్పులు

లిక్కర్ కేసులో కల్వకుంట్ల కవితకు రిమాండ్ … తీహార్ జైలుకు తరలింపు

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు భారీ షాక్ తగిలింది. కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను రౌస్ అవెన్యూ కోర్టు తిరస్కరించింది. ఈ నాటి విచారణ సందర్భంగా ఆమె పిటిషన్ పై తీర్పును కాసేపు రిజర్వ్ లో ఉంచిన కోర్టు… కాసేపటి క్రితం తీర్పును వెలువరించింది. ఆమెకు 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఏప్రిల్ 9వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ తీర్పును వెలువరించింది. ఆమెను తీహార్ జైలుకు తరలించాలని పోలీసులను ఆదేశించింది. దీంతో పోలీసులు కవితను తీహార్ జైలుకు తరలించారు . కోర్టు తీర్పుతో బీఆర్ఎస్ శ్రేణులు షాక్ కు గురయ్యారు. దీనిపై బీఆర్ యస్ స్పదించలేదు ….కవిత తనపై పెట్టిన కేసు అక్రమం అని ,అన్యాయం అని ,రాజకీయ ప్రేరేపితం అని మొత్తుకుంటున్నా ఆమె మొరను పరిగణనలోకి తీసుకోలేదు …

మరోవైపు, కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ పై ఏప్రిల్ 1న పూర్తి విచారణ జరుపుతామని కోర్టు తెలిపింది. తన కుమారుడికి పరీక్షలు ఉన్నాయని, తనకు మధ్యంత బెయిల్ మంజూరు చేయాలని కోర్టును కవిత కోరారు. అయితే, ఆమె విన్నపాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. ఇంకోవైపు, కవితను మరో 15 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరినప్పటికీ… ఆమెకు కోర్టు రిమాండ్ విధించడం గమనార్హం. రిమాండ్ లో ఉన్న కవితను ఈడీ తమ కస్టడీకి కోరే అవకాశం ఉంది.

Related posts

మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌కు 6 నెలల జైలు శిక్ష…

Ram Narayana

ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి నుంచి కేజ్రీవాల్ ను తప్పించాలన్న పిటిషన్ తిరస్కరణ

Ram Narayana

అలా అయితే ఏ రాజకీయ నాయకుడిని అరెస్ట్ చేయలేం…కేజ్రీవాల్‌కు బెయిల్ ఇవ్వొద్దు: కోర్టుకు ఈడీ విజ్ఞప్తి

Ram Narayana