Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

సెల్ఫీకి యత్నించిన అభిమానికి బాలయ్య చేతి దెబ్బ…!

  • నేటి నుంచి బాలకృష్ణ ఎన్నికల ప్రచారం
  • కదిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పూజలు
  • కదిరి వచ్చిన బాలయ్యను చుట్టుముట్టిన అభిమానులు
  • బాలయ్య రౌద్రావతారం

టాలీవుడ్ సీనియర్ కథానాయకుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అభిమానులపై చేయి చేసుకోవడం కొత్త కాదు. అభిమానులు కూడా బాలయ్య తమ పట్ల కోపం ప్రదర్శించడంపై ఎప్పుడూ ఫిర్యాదు చేసింది లేదు. 

ఇవాళ బాలకృష్ణ కదిరి నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. స్వర్ణాంధ్ర సాకార బస్సు యాత్ర పేరిట ఎన్నికల ప్రచారం ప్రారంభించే ముందు సత్యసాయి జిల్లా కదిరిలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి విచ్చేశారు. 

హెలికాప్టర్ దిగి ఇవతలికి వస్తున్న బాలయ్యను ఒక్కసారిగా అభిమానులు చుట్టుముట్టారు. ఓ అభిమాని సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించగా, బాలయ్య ఆ అభిమానిపై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా, ఒక్కటిచ్చుకున్నాడు. అతడిపై నిప్పులు కురిపించేలా కోపంగా చూశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Related posts

తెలంగాణా కాంగ్రెస్ లో ముసలం …

Drukpadam

ఆకలితో అలమటిస్తున్నాం ఆదుకోండి హెచ్.ఆర్ .సి ని వేడుకున్న ఆంధ్రభూమి ఉద్యోగులు

Drukpadam

కొన్ని రోజులపాటు కలిసి ఉన్నంత మాత్రాన అది సహజీవనం అనిపించుకోదు: పంజాబ్, హర్యానా హైకోర్టు!

Drukpadam

Leave a Comment