Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

నూతన పార్టీకి అధికార ప్రతినిధులను నియమించిన వైఎస్ షర్మిల

నూతన పార్టీకి అధికార ప్రతినిధులను నియమించిన వైఎస్ షర్మిల
-పార్టీ పేరును రిజిస్టర్ చేయించిన షర్మిల
-వైఎస్ఆర్ తెలంగాణ పార్టీగా ఈసీ వద్ద నమోదు
-జూలైలో పార్టీ ప్రకటన!
-తెలంగాణలో జోరుగా షర్మిల కార్యకలాపాలు

షర్మిల పార్టీ పేరు ఖరారు అయింది … పార్టీకి అధికార ప్రతినిధుల నియామకం కూడా ఖరారు చేశారు. ఇంకా పార్టీ పేరు అధికారికంగా వెల్లడించనప్పటికీ ,వై యస్ ఆర్ పుట్టిన రోజున ఆమె పార్టీ పేరును అధికారికంగా ప్రకటించనున్నారు. …. ఇక కావలసింది జెండా ,ఎజెండా నే దానిపై కూడా ఇప్పటికే ఒక క్లారిటీకి వచ్చారు….. జెండా లేత పసుపు రంగులో ఉండేలా డిజైన్ చేసినట్లు తెలుస్తుంది. …ఖమ్మం బహిరంగ సభలో ఆమె లేత పసుపు థిక్ బ్లూ బోర్డర్ చీర , బ్లవుజ్ వేసుకున్నారు . దాదాపు దాన్ని పోలె జెండా ఉంటుందని వైయస్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు……ఎజెండా విషయానికి వస్తే తెలంగాణ లో రాజన్న సంక్షేమ రాజ్యం తెస్తానని అంటున్న షర్మిల అందుకు అనుగుణంగానే ఎజెండా ఖరారు చేయనున్నారు.
వైఎస్ షర్మిల తెలంగాణలో స్థాపించబోయే పార్టీకి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ (వైఎస్ఆర్టీపీ) అనే పేరు ఖరారైంది. ఇటీవల షర్మిల ప్రధాన అనుచరుడు వాడుక రాజగోపాల్ కేంద్ర ఎన్నికల సంఘం వద్ద ఈ పార్టీ పేరును రిజిస్టర్ చేయించారు. ఈ క్రమంలో షర్మిల తన పార్టీకి అధికార ప్రతినిధులను నియమించారు.

ఇందిరా శోభన్, సయ్యద్ ముజ్జాద్ అహ్మద్, పిట్ట రాంరెడ్డి, కొండా రాఘవరెడ్డి, ఏపూరి సోమన్న, తేడి దేవేందర్ రెడ్డి, బీశ్వ రవీందర్, మతిన్ ముజాదద్ది, భూమిరెడ్డిలను అధికార ప్రతినిధులుగా పేర్కొంటూ షర్మిల కార్యాలయం నుంచి ఓ ప్రకటన వెలువడింది. కాగా, షర్మిల పార్టీని జులై 8న వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. తెలంగాణాలో నిరుద్యోగ సమస్యపై ఆమె ఇప్పటికే కొన్ని కార్యక్రమాలు నిర్వహించారు. ఇటీవలనే మెదక్ జిల్లా పర్యటించి ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగ యువకుడి కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు …. కరోనా తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళలకు బాసటగా నేను ఉన్నానంటూ ప్రకటన చేశారు .

Related posts

ప్రజాసమస్యలు గాలికి వదిలేసి సినిమా టికెట్స్ చుట్టూ తిరుగుతున్నారు …పయ్యావుల కేశవ్ !

Drukpadam

ఇటు ధర్నా …అటు తనిఖీలు చల్లారని మునుగోడు హీట్…

Drukpadam

షర్మిల దీక్షను భగ్నం చేసి అదుపులోకి తీసుకున్న పోలీసులు!

Drukpadam

Leave a Comment