Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

కేసీఆర్ మూర్ఖంగా మాట్లాడుతున్నారు: తుమ్మల నాగేశ్వరరావు

  • ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీఆర్ఎస్ కు అభ్యర్థులు లేరన్న తుమ్మల
  • కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని చెప్పడం కేసీఆర్ మూర్ఖత్వమని వ్యాఖ్య
  • మూడో సారి మోసం చేేసేందుకు మోదీ వస్తున్నాడని విమర్శ

పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ప్రస్తుతం దారుణంగా ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీఆర్ఎస్ కు అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. 400 సీట్లు గెలుచుకుంటామంటూ బీజేపీ మ్యాజిక్ చేసే ప్రయత్నం చేస్తోందని… రెండు సార్లు ప్రజలను మోసం చేసిన మోదీ… మూడోసారి మోసం చేసేందుకు వస్తున్నారని విమర్శించారు. పదేళ్ల పాలనలో తెలంగాణకు మోదీ ఒక్క ప్రభుత్వరంగ సంస్థను కూడా తీసుకురాలేదని అన్నారు. బొగ్గుగనులను ప్రైవేటుపరం చేసేందుకు రంగం సిద్ధం చేశారని దుయ్యబట్టారు. రాహుల్ ను ప్రధాని చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పారు. 

ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని కేసీఆర్ చెప్పడం ఆయన మూర్ఖత్వానికి నిదర్శనమని అన్నారు. కేసీఆర్ మాటలు విడ్డురంగా ఉన్నాయని తుమ్మల తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు … లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్, బీజేపీ లోపాయకారీ ఒప్పందంతో పని చేస్తున్నాయని ఆరోపించారు. మహబూబాబాద్ లోక్ సభ పరిధిలోని ఇల్లందులో మహిళా నాయకుల సన్నాహక సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో తుమ్మల మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.

Related posts

కాంగ్రెస్ టిక్కెట్ కేటాయింపులు.. తెలంగాణ నేతలకు ఢిల్లీ నేత కీలక సూచన

Ram Narayana

పొంగులేటి షాక్ ….ముఖ్య అనుచరుడు డాక్టర్ తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ కు గుడ్ బై …

Ram Narayana

త్వరలో ప్రజల్లోకి వస్తున్నాను: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్

Ram Narayana

Leave a Comment