Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

రైతు సమస్యలే అజెండగా ప్రజల్లోకి : ఎంపీ నామ నాగేశ్వరరావు

బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ గురువారం హైదరాబాద్ లోని తెలంగాణ భవన్‌లో పార్టీ నేతలతో కీలక సమీక్ష నిర్వహించారు. ఎంపీ అభ్యర్థులతో పాటు పార్టీ శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, జడ్పీచైర్మన్లు, పార్టీ కార్యవర్గ సభ్యులు, ముఖ్యనేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మిగతా అభ్యర్థులతో పాటు ఖమ్మం ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు కు కేసీఆర్ బీఫామ్ అందజేశారు. ఎన్నికల్లో ప్రచారం, అనుసరించాల్సిన వ్యూహంపై నేతలకు, అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు. ప్రధానంగా బస్సు యాత్ర రూట్‌మ్యాప్‌పైన, పార్లమెంట్ ఎన్నికల ప్రచార సరళిపై , వారితో విస్తృతంగా చర్చించారు.సరికొత్త పందా లో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించినట్లు నామ తెలిపారు. రైతు సమస్యలు అజెండాగా విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లాలని కేసీఆర్ దిశా నిర్దేశం చేశారని తెలిపారు. ఉదయం పూట పొలం బాట పట్టి ఎండిన పంట పొలాలను పరిశీలించిన తర్వాత రోడ్డు షోలు నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారని చెప్పారు. పలు చోట్ల భారీ బహిరంగ సభలకుకూడా ప్లాన్ చేసినట్లు నామ వెల్లడించారు. ఈ సందర్భంగా ఎన్నికల ఖర్చు కోసం అభ్యర్థులకు నియమావళి ప్రకారం రూ.95 లక్షల చెక్కులను అందజేశారు.

ఇంకా ఈ సమావేశంలో జిల్లా కు చెందిన రాజ్యసభ సభ్యులు వద్ధిరాజు రవిచంద్ర,ఖమ్మం జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఖమ్మం జెడ్పీ చైర్మన్ లింగాల కమలరాజు, అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, మాజీ డీసీసీబీ అధ్యక్షులు కూరాకుల నాగభూషణంజిల్లాకు చెందిన మాజీ శాసన సభ్యులు, పార్టీ నాయకులు ఆర్జేసీ కృష్ణ, బొమ్మెర రామ్మూర్తి, తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఖమ్మం పార్లమెంట్ లో పోలైన ఓట్లు 12 లక్షల 41 వేల 135 …76 .09 శాతం

Ram Narayana

నన్ను సాదుకుంటారా.. సంపుకుంటారా మీఇష్టం .. మంత్రి పువ్వాడ అజయ్

Ram Narayana

సిపిఐ ఎం ఎల్ మాస్ లైన్ రాష్ట్ర నాయకులు రాయల చంద్రశేఖర్ అకస్మిక మృతి…

Ram Narayana

Leave a Comment