Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా రామసహాయం రఘురాం రెడ్డి..!

ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా రామసహాయం రఘురాం రెడ్డిని ఏఐసీసీ కార్యదర్శి కేసి వేణుగోపాల్ బుధవారం రాత్రి ప్రకటించారు …అనేక పీఠముడుల మధ్య అభ్యర్థిపై చర్చోపచర్చలు దోబుచులాడిన అనంతరం ఆయన పేరు ప్రకటించడం గమనార్హం …ఎన్నికలకు కేవలం 18 మాత్రమే ఉంది …ప్రచారానికి 16 రోజుల సమయం మాత్రమే ఉంది … నియోజకవర్గాల వారీగా అన్ని పార్టీల ముఖ్య కార్యకర్తల సమావేశానికి మాత్రమే అవకాశం ఉంది …భారం మొత్తం ఎమ్మెల్యేల పైనే ఉంటుంది …

Congress announces three lok sabha candidates

నామినేషన్ గడువు ముగియనున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ మిగిలిన మూడు లోక్ సభ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఖమ్మం నుంచి రామసహాయం రఘురాంరెడ్డి, కరీంనగర్ నుంచి వెలిచాల రాజేందర్ రావు, హైదరాబాద్ నుంచి మహమ్మద్ సమీర్‌లను బరిలోకి దింపుతోంది.

తెలంగాణలో నామినేషన్ ప్రక్రియ రేపటితో ముగియనుంది. ఏప్రిల్ 18న ప్రారంభమైన నామినేషన్ దాఖలు ప్రక్రియ 25న ముగుస్తుంది. ఏప్రిల్ 26వ తేదీన స్క్రూటీని ఉంటుంది. ఏప్రిల్ 29వ తేదీ వరకు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. 17 లోక్ సభ స్థానాల్లో మే 13న ఒకేదఫాలో పోలింగ్ పూర్తవుతుంది.

అదే విధంగా ఖమ్మం ,వరంగల్ , నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఆమోదం తో ప్రకటిస్తున్నట్లు వేణుగోపాల్ తెలిపారు …

ఇప్పటికే అనధికారికంగా మంగళవారం రెండు సెట్ల నామినేషన్లు వేసిన రఘురాం రెడ్డి అనుయాయులు … రఘురాం రెడ్డి నామినేషన్ కార్యక్రమం గురువారం అధికారికంగా ఉంటుంది బీ ఫారం కూడా రిటర్నింగ్ అధికారికి అందజేయనున్నారు …ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన మంత్రులు ,ఎమ్మెల్యేలు , ఇతర ప్రజాప్రతినిధులు , సిపిఐ ,సిపిఎం పార్టీల నేతలు పాల్గొన నున్నారు ..

జననం, విద్యాభ్యాసం : రామసహాయం రఘురాం రెడ్డి 1961, డిసెంబర్ 19న రామసహాయం సురేందర్ రెడ్డి, జయమాల దంపతులకు హైదరాబాద్ లో జన్మించారు. కాగా వీరి స్వగ్రామం పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండలంలోని చేగొమ్మ. ఆయన హైదరాబాద్ లోని నిజాం కళాశాలలో బీకామ్ విద్యను, అనంతరం పీజీ డిప్లొమా విద్యను అభ్యసించారు. ప్రస్తుతం వ్యాపార రీత్యా హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారు. ఈయన తండ్రి రామసహాయం సురేందర్ రెడ్డి ఖమ్మంలోనే పుట్టి పెరిగారు.

వ్యక్తిగత జీవితం : రఘురాం రెడ్డికి ఇద్దరు కుమారులు. కాగా వారిలో పెద్ద కుమారుడు వినాయక్ రెడ్డి సినీ హీరో దగ్గుబాటి వెంకటేష్ పెద్ద కుమార్తె ఆశ్రితను, చిన్న కుమారుడు అర్జున్ రెడ్డి ప్రస్తుత తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో రెవెన్యూ శాఖ మంత్రిగా కొనసాగుతున్న పొంగులేటి శ్రీనివాస రెడ్డి కుమార్తె సప్ని రెడ్డిని వివాహం చేసుకున్నారు.

రాజకీయ ప్రస్థానం : రామసహాయం రఘురాం రెడ్డి తండ్రి రామసహాయం సురేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో డోర్నకల్ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, వరంగల్ లోక్ సభ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎంపీగా పనిచేసిన అనుభవం ఉంది. తండ్రి సురేందర్ రెడ్డి స్ఫూర్తితో ఒక వైపు వ్యాపారాలు చేస్తూనే.. 1985 నుంచి కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. దివంగత ప్రధానమంత్రులు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, పీవీ నరసింహారావులతో వీరి కుటుంబానికి సాన్నిహిత్యం ఉండేది. సురేందర్ రెడ్డి కూసుమంచి మండలంలోని జీళ్ళచెర్వు, చేగొమ్మ, ముత్యాలగూడెం గ్రామాలకు, ఖమ్మం రూరల్ మండలంలోని మద్దులపల్లి గ్రామానికి పోలీస్ పటేల్ గా పనిచేశారు.

కాంగ్రెస్ పార్టీలో నిర్వర్తించిన బాధ్యతలు: 1985లో జరిగిన ఎన్నికల్లో డోర్నకల్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ చార్జ్ గా, 1989, 1991లో అప్పటి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రెండు అసెంబ్లీ స్థానాలకు, వరంగల్ లోక్ సభకు ఇన్ చార్జ్ గా పనిచేశారు. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి 2012లో రాజ్యసభకు, 2014లో ఎమ్మెల్సీ పదవులకు నామినేట్ చేయగా చివరి నిమిషంలో అవి వేరే వారిని వరించాయి. 2014లో పాలకుర్తి, 2018లో పాలేరు నియోజకవర్గం నుంచి టిక్కెట్ ఆశించినప్పటికీ దక్కలేదు.

ఇతర పదవులు : రఘురాం రెడ్డి 2011-2013లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్ సీ ఏ ) ప్యాటరన్ గా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ వైస్ చైర్మన్ గా , హైదరాబాద్ రేస్ క్లబ్ లో బోర్డు సభ్యులుగా వ్యవహరిస్తున్నారు.

సేవా కార్యక్రమాలు : రఘురాం రెడ్డితో పాటు వారి తాతముత్తాతలు సేవాదృక్పథ కుటుంబానికి చెందిన వారు. మరిపెడ- బంగ్లా లో ప్రస్తుత ప్రభుత్వ కార్యాలయాలుగా కొనసాగుతున్న మార్కెట్ యార్డు, పోలీస్ స్టేషన్, తహసీల్దార్, ఎంపీడీవో, ఆర్టీసీ బస్టాండ్, పీహెచ్ సీ లు , ప్రభుత్వ పాఠశాల, ప్రభుత్వ కళాశాలలు, టిటిడి కల్యాణ మండపాలకు దశాబ్దాల కాలం కిందటే ఉచితంగా స్థలాలను కేటాయించారు. వరంగల్ లో రెడ్డి ఉమెన్స్ హాస్టల్ ను నిర్మించారు. అనేక ప్రాంతాల్లో రామాలయాలను, శివాలయాలను, వేంకటేశ్వరస్వామి ఆలయాలను నిర్మించారు. వారి స్వగ్రామమైన కూసుమంచి మండలం చేగొమ్మలో వారి ఇంటిని ప్రభుత్వ పాఠశాల కోసం ఉచితంగా ఇచ్చారు. పీహెచ్ సీ , చేగొమ్మ హరిజన కాలనీకి కూడా స్థలాలను ఇచ్చారు …

రేపు కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్థిగా ఆర్ఆర్ఆర్ నామినేషన్ దాఖలు…మంత్రి పొంగులేటి

కాంగ్రెస్ పార్టీ ఖమ్మం లోక్ సభ అభ్యర్థి రామ సహాయం రఘు రాం రెడ్డి గురువారం ఖమ్మం కలెక్టరేట్ లోని ఏఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేస్తారని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు రేణుక చౌదరి, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ , ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు తదితరుల సమక్షంలో నామినేషన్ వేయనున్నట్లు పేర్కొన్నారు. నామినేషన్ సందర్భంగా ఉదయం 10 గంటలకు నగరంలోని కాల్వొడ్డు నుంచి ర్యాలీ బయలుదేరి మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగుతుందని పొంగులేటి తెలిపారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని మంత్రి పొంగులేటి పిలుపునిచ్చారు.

Related posts

జుబ్లియంట్ మూడ్ లో భట్టి, పొంగులేటి ,తుమ్మల

Ram Narayana

ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు ….

Drukpadam

సత్తుపల్లి కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న మట్టా దయానంద్ ఎస్సీ సర్టిఫికెట్ రద్దు ..

Ram Narayana

Leave a Comment