ఖమ్మం బీజేపీ అభ్యర్థి తాండ్రకు పెరుగుతున్న ఆదరణ …
మోడీ పాలన ,అయోధ్య రామమందిరం నిర్మాణం పై ఆశలు
ప్రజల్లో కదలిక తెస్తున్న బీజేపీ ప్రచారం
తాండ్ర వినోద్ రావు మాటలు వింటున్న ఓటర్లు
బీజేపీకి గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్న అభ్యర్థి
ఖమ్మం పార్లమెంట్ పరిధిలో బీజేపీకి పెద్దగా ఆదరణ ఉండకపోవచ్చునని అభిప్రాయాలు ఉండగా అందుకు భిన్నంగా ఆపార్టీ నుంచి పోటీచేస్తున్న అభ్యర్థి తాండ్ర వినోద్ రావు తన ప్రచారం ద్వారా ప్రజల మనసులు గెలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు …సౌమ్యుడిగా ,విద్యావేత్తగా ఆయనకు పేరుంది …పైగా జిల్లాకు చెందినవారు కావడం కలిసొచ్చే అంశం … బీజేపీ విధానాలకు తోడు అభ్యర్థి ప్రజలతో మమేకం అవుతున్న తీరు ఆకట్టుకుంటున్నది …దీంతో ప్రజల నుంచి గతంలో ఎన్నడూ లేనివిధంగా బీజేపీకి ఆదరణ కనిపిస్తుండటం విశేషం …తాండ్ర వినోద్ రావు ను పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన దగ్గర నుంచి నిరంతరం ప్రజల్లో ఉంటున్నారు …మొదట పార్టీ నేతల నుంచి సహకారం అందడంలేదని వినిపించినప్పటికీ కొద్దీ రోజుల తర్వాత అది సద్దుమణిగింది …ఇప్పుడు పార్టీ నాయకులు కార్యకర్తలు తాండ్ర వినోదరావు గెలుపు కోసం శ్రమిస్తున్నారు …ఆయన నామినేషన్ కార్యక్రమానికి కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ రావడం బీజేపీ విశేషం … ఖమ్మం సీటు విషయంలో బీజేపీ అధిష్టానం ఎంత పట్టుదలతో ఉందో అర్ధం చేసుకోవచ్చు …
బీజేపీకి ఖమ్మం జిల్లాలో ఒక్క పర్యాయం తప్ప పెద్దగా ఓట్లు వచ్చిన దాఖలాలు లేవు …ఒక్క రవీంద్ర నాయక్ ను పోటీ పెట్టినప్పుడు మాత్రమే ఆ సామజిక వర్గం ఓట్లు భారీగా బీజేపీ అభ్యర్థికి పాలైయ్యాయి….సుమారు లక్ష 18 వేల ఓట్లు రావడం పరిశీలకులను సైతం ఆశ్చర్యపర్చింది… అంతకు మూడు బీజేపీ అభ్యర్థికి ఎప్పుడు 25 వేలకు మించి ఓట్లు రాలేదు …2019 ఎన్నికల్లో బీజేపీ తరుపున దేవకీ వాసుదేవరావు పోటీచేయగా ఆయనకు 20 లోపే ఓట్లు వచ్చాయి…గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో సైతం బీజేపీ అభ్యర్థులకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎక్కడ డిపాజిట్లు దక్కలేదు …తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి బలహీనమైన జిల్లాలలో ఖమ్మం మొదటి స్థానంలో ఉంటుంది …
ఈసారి కేంద్రంలో మోడీ పాలన , అయోధ్య రాముడు ఓట్లు కురిపిస్తారని బీజేపీ నేతలు గట్టిగ నమ్ముతున్నారు …అయోధ్యలో రామమందిరం ప్రారంభసందర్భంగా ప్రతిగ్రామానికి అయోధ్య తలంబ్రాల పేరుతో పంపిణి జరిగింది …చాల ఇళ్ల మీద కాషాయ జెండాలు ఎగర వేశారు …ప్రజల్లో ఉన్న భక్తి సెంటిమెట్ పండితే బీజేపీ అభ్యర్థికి గణనీయమైన ఓట్లు వచ్చే అవకాశం కొట్టి పారేయలేమని రాజకీయ పరిశీలకుల అభిప్రాయం …