Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామసహాయం ఉరుకులు పరుగులు ….

అనేక చిక్కుముడులను విప్పుకొని పట్టుదలతో ఖమ్మం సీటు సాధించిన మంత్రి పోటులేటికి అసలు పరీక్ష మొదలైంది …అసెంబ్లీ ఎన్నికల్లో తన గెలుపు కోసం అంతగా శ్రమించని పొంగులేటికి ఖమ్మం సీటు గెలుపు ప్రతిష్టాత్మకంగా మారింది …నామినేషన్ల చివరి రోజువరకు అభ్యర్థిని ప్రకటించకుండా ఉండటం పెద్ద డ్రా బ్యాక్ గానే చెప్పవచ్చు ….కాంగ్రెస్ కు ఖమ్మం జిల్లా కంచుకోట …ఇక్కడ అభ్యర్థి ఎవరైనా ఈజీగా గెలిచే సీటు …కానీ మంత్రుల పట్టింపులతో కొంత కష్టంగా మారింది …అయినప్పటికీ ఎంపికైన అభ్యర్థి ఖమ్మంలో నామినేషన్ వేసిన వెంటనే రంగంలోకి దిగారు …ఉరుకులు ..పరుగులు పెడుతున్నారు …ఖమ్మంలో సాయంత్రం వాకర్స్ ను కలిశారు …వారితో ముచ్చటించారు …తాను కాంగ్రెస్ అభ్యర్థిగా లోకసభకు పోటీచేస్తున్నానని తనకు ఓట్లు వేసి గెలిపించాలని అభ్యర్థించారు ….ప్రజల నుంచి మంచి మద్దతు ఉందని ,తమ గెలుపు డోకా లేదని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి….

తన తమ్మడు ప్రసాద్ రెడ్డికి టికెట్ ఇప్పించాలని మొదటి నుంచి గట్టి పట్టుదలతో ఉన్న పొంగులేటి కుటుంబసభ్యుడు కావడంతో టికెట్ ఇవ్వలేదు ..అయితే తన వియ్యంకుడు రఘురాంరెడ్డికి టికెట్ ఇప్పించుకోవడంలో సక్సెస్ అయిన మంత్రి పొంగులేటి ఖమ్మం సీటు గెలిపించాల్సిన గురుతర భాద్యత ఆయన భుజస్కందాలపై పడింది ….,మంత్రులను , ఎమ్మెల్యేలను , వామపక్ష పార్టీలను కలుపుకొని పోవాల్సిన అవసరం ఏర్పడింది …ఎన్నికలకు కొద్దీ రోజులే ఉండటంతో ప్రచారాన్ని వాయివేగంతో నిర్వహించాలి …అందుకు తగ్గ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలి …
కమ్మ సామాజికవర్గం మద్దతు కూడా గట్టాలి …

ఖమ్మం లోకసభ పరిధిలో కమ్మ సామాజికవర్గం బలమైన వోటింగ్ కలిగి ఉంది …కమ్మ సాజికవర్గానికి సీటు కావాలని పట్టు పట్టినప్పటికీ అనివార్యకారణాల వల్ల రెడ్డి సామాజికవర్గానికి కేటాయించక తప్పలేదు …అయితే రెడ్డి సామాజికవర్గం కమ్మ సామాజికవర్గం మద్దతు కూడా గట్టాలి … లేకపోతె ఫలితం మరోలా ఉంటుంది …

Related posts

ప్రచారంలో దుమ్ము రేపుతున్న బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు…

Ram Narayana

బీ.అర్.ఎస్ పార్టీకి షాక్..రఘునాథపాలెం సర్పంచ్ పార్టీకి గుడ్ బై…

Ram Narayana

ఇది ప్రజాగెలుపు రామసహాయం విజయంపై మంత్రి పొంగులేటి స్పందన …

Ram Narayana

Leave a Comment