Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

అది చంద్రబాబు విచక్షణకే వదిలేస్తున్నా: వైఎస్ భారతి

  • పులివెందులలో ప్రచారం నిర్వహిస్తున్న భారతి
  • జగన్ గురించి చంద్రబాబు మాట్లాడుతున్న తీరు సరిగా లేదని వ్యాఖ్య
  • ఒక వ్యక్తిని అడ్డు తొలగించాలనుకోవడం సరికాదని వ్యాఖ్య

ముఖ్యమంత్రి జగన్ నియోజకవర్గంలో ఆయన భార్య వైఎస్ భారతి ప్రచారాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. గడపగడపకు వెళ్లి ఆమె ఓటర్లను కలుస్తున్నారు. వైసీపీ మేనిఫెస్టో గురించి ప్రజలకు వివరిస్తున్నారు. ప్రచారం సందర్భంగా ఆమె మాట్లాడుతూ… జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలపై విమర్శలు గుప్పించారు. ప్రజా జీవితంలో ఉన్నవారు విచక్షణతో మాట్లాడాలని అన్నారు. వయసులో పెద్దవారైన చంద్రబాబు జగన్ గురించి మాట్లాడుతున్న తీరు సరిగా లేదని చెప్పారు. 

జగన్ పై జరిగిన రాయి దాడి గురించి మాట్లాడుతూ… ఒక వ్యక్తిని చంపాలనుకోవడం సరికాదని అన్నారు. ప్రజలను మెప్పించాలని అనుకోవాలే కానీ… అడ్డు తొలగించుకోవాలనుకోవడం దారుణమని చెప్పారు. దీన్ని ఆయన విచక్షణకే వదిలేస్తున్నామని అన్నారు. పులివెందులలో అభివృద్ధి లేదనే వారికి కళ్లు లేవనుకోవాలని చెప్పారు. పులివెందులలో ఎంతో అభివృద్ధి జరిగిందని తెలిపారు. మరింత అభివృద్ధి జరగాలంటే జగన్ కు మరోసారి ఓటు వేసి గెలిపించాలని అన్నారు.

Related posts

డిసెంబర్ లోగా విశాఖకు షిఫ్ట్ అవుతున్నా: జగన్ కీలక ప్రకటన

Ram Narayana

వైసీపీకి జగ్గంపేట ఎమ్మెల్యే చంటిబాబు గుడ్ బై టీడీపీలో చేరికకు రంగం సిద్ధం …!

Ram Narayana

తోపుదుర్తి మాటలు విని జగన్ వస్తున్నాడు…పరిటాల సునీత

Ram Narayana

Leave a Comment