Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

ఆటోవాలా అవతారమెత్తిన నామ …

బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు ఆటోవాలాగామారారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ఉదయం ఖమ్మం పాత బస్టాండ్ కు పోయి ప్రయాణీకులను, ఆటోవాలా లను కలిసి, ఓట్లు అభ్యర్దిం చారు. పిలిస్తే పలుకు తాను ..మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి, అండగా ఉండి అదుకుంటాను..మీ వాడిని మీలో ఒకడిని… ఆశీర్వదించండటూ నామ గారు వారితో మమేకమయ్యా రు. మీ అందరి ఆశీర్వాదంతో రెండు సార్లు మంచి మెజార్టీతో గెలిచి పార్లమెంట్ కు వెళ్లి కేంద్రంతో కొట్లాడి ఎంతో అభివృద్ధి చేశాను.. మళ్లీ ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేస్తానని చెప్పారు.
ఈ సందర్భంగా అక్కడే చిన్న చిన్న వ్యాపారాలు చేసు కుంటున్న రోజువారీ కార్మికులను కూడా కలిసి ఓట్లు అభ్యర్దించారు

ఈ సందర్భంగా నామ గారు స్వయంగా ఆటో నడిపి వారితో ఏకమయ్యరు. ఆటో డ్రైవర్లు ఆత్మీయంగా పలకరించి, నామకు మద్దతు తెలిపారు. అనంతరం నామ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చాతగాని తనం వల్ల నేడు ఆటో డ్రైవర్లు పనులు లేక పూట గడవక నానా అవస్థపడుతున్నారని ఆటో డ్రైవర్లు నామ గారితో గోస పడ్డారు. ఈ సందర్భంగా డ్రైవర్లు తమ సమస్యలను నామ గారికి వివరించి, ఆవేదన వ్యక్తంచేశారు.కుటుంబాలు గడవక కొంతమంది ఆత్మహత్య లకు పాల్పడడం తనను ఎంతగానో కలచివేసిందని నామ పేర్కొన్నారు. కేసీఆర్ పాలనలో ఎలా ఉండేది.. ఇప్పుడెలా ఉందని అన్నారు. తనను మంచి మెజార్టీతో గెలిపించి, కేసీఆర్ కు మద్దతుగా నిలవాలని నామ కోరారు.ఈ కార్యక్రమంలో డేరంగుల బ్రహ్మo , గోడ్డేటి మాధవరావు, వాకదాని కోటేశ్వరరావు, చిత్తారు సింహాద్రి యాదవ్, మోరంపూడి ప్రసాద్, నామ రామారావు, నామ భవ్య తేజ, సాయిరాం, నల్లమోతు కోటేశ్వరరావు, ఆటో డ్రైవర్ల యూనియన్ నాయకులు సందీప్, సుబ్బారావు, వెంకటేష్, పుల్లారావు తదితరులతో పాటు తాళ్లూరి హరీష్, చీకటి రాంబాబు, సరిపూడి గోపీ సందేశ్, కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు.

Related posts

జర్నలిస్టులకు ఉచితంగా హోమియో మందులు పంపిణీ

Ram Narayana

ఈసారి మోదీ వస్తే ఇక ఎన్నికలు ఉండవు..సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని

Ram Narayana

సీఎం కేసీఆర్ ఖమ్మం ప్రజా ఆశ్వీరవాదసభ గేమ్ చెంజర్ …మంత్రి పువ్వాడ

Ram Narayana

Leave a Comment