ఖమ్మం వార్తలు

ఇద్దరు అన్నదమ్ములు ఖమ్మం మున్నేరులో ఆకస్మిక వరదలకు మృతి

ఇద్దరు అన్నదమ్ములు ఖమ్మం మున్నేరులో ఆకస్మిక వరదలకు మృతి
దుఃఖ సాగరంలో చిన్నమండవ గ్రామం
కన్నీరు మున్నీరు అవుతున్న గ్రామస్తులు

తమ గ్రామం పక్కనే ఉన్న మున్నేరు లో తమ మోటార్ బైక్ శుభ్రం చేసుకునేందుకు వెళ్లిన ఇద్దరు అన్నదమ్ములు వరద నీటిలో కొట్టుకుని పోయిన సంఘటన హృదయ విదారకంగా ఉంది ..వివరాల్లోకి వెళ్ళితే చింతకాని మండలం చిన మండవ గ్రామానికి చెందిన అన్నదమ్ములు తమ బైక్ ను మున్నేరు లో కడిగేందుకు వెళ్లారు …అక్కడ బైక్ శుభ్రం చేస్తుండగా ఒక్కసారిగా వరద రావడంతో బయటకు వెళ్లే దారిలేక నీటి ప్రవాహంలో కొట్టుకొని పోయారు ..ఇది వారి కుటుంబాన్నే కాకుండా గ్రామాన్ని సైతం కన్నీటి సముద్రంలో ముంచింది … విషయం తెలిసిన వెంటనే హైద్రాబాద్ లో ఉన్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క భాదితులను పరామర్శించి తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు ..మృతులకు సంతాపం తెలియజేస్తూ , వారు కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతు తెలిపారు ..

గల్లంతై మృతి చెందడం చాలా బాధాకరం … ప్రభుత్వం తరఫున ఆ కుటుంబాలకు 25 లక్షలు ఎక్సగ్రేషియా చెల్లించాలని ప్రభుత్వం ఆదుకోవాలని ప్రజలు వివిధ రాజకీయ పార్టీలు ప్రజాసంఘాలు డిమాండ్ చేశాయి…

Related posts

హెచ్చరికలు బేఖాతరు.. వరద నీటిలో కొట్టుకుపోయిన డీసీఎం… డ్రైవర్ గల్లంతు..

Ram Narayana

ఖమ్మం జిల్లాలో కలెక్టర్ విపి గౌతమ్ కొత్త ఆలోచన… శాశ్విత ప్రాతిపదికన పోలింగ్ స్టేషన్ల ఆధునికీకరణ..!

Ram Narayana

20 స్థానాలు పెరిగితే రాజకీయ ముఖ చిత్రం మారేది…

Ram Narayana