Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

పిబ్రవరిలో టీయుడబ్ల్యూజే (ఐజేయు) ఖమ్మం జిల్లా మహాసభలు!

ఫిబ్రవరిలో టీయూడబ్ల్యూజే (ఐజేయు) ఖమ్మం జిల్లా మహాసభలు వైరాలో నిర్వహించాలని యూనియన్ జిల్లా కమిటీ అభిప్రాయపడింది . మంగళవారం వైరాలో యూనియన్ జిల్లా సహాయ కార్యదర్శి ఏపూరి రాజారావు అధ్యక్షతన జరిగిన సన్నాహక సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. ఈ సమావేశానికి యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. రాంనారాయణ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. జర్నలిస్టుల ప్రధాన సమస్యలు పరిష్కరించేందుకు పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయని చెప్పారు. జర్నలిస్టులహెల్త్ కార్డులు, ఇండ్ల స్థలాలు,అక్రిడిటేషన్ కార్డుల సమస్యల పరిష్కారం కోసం మీడియా అకాడమీ చైర్మన్ తో కలిసి ముఖ్యమంత్రి, ఇతర మంత్రులతో యూనియన్ ప్రతినిధులు మాట్లాడినట్లు తెలిపారు. హెల్త్ కార్డుల విషయంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదరం రాజనర్సింహను కలిసి మాట్లాడామన్నారు. ఉద్యోగులకు ఇచ్చినట్లుగానే కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచితంగా వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చినట్లు తెలిపారు . ఇక అక్రిడిటేషన్ కార్డుల జారీకి సంబంధించి మీడియా అకాడమీ చైర్మన్ నేతృత్వంలో ప్రభుత్వానికి కొత్త ప్రతిపాదనలు సమర్పించినట్లు పేర్కొన్నారు . గత ప్రభుత్వంతో పోలిస్తే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందిస్తుందని, సమస్యలు చెబితే వింటుందని, సమస్యల పరిష్కారానికి ఖచ్చితంగా కృషి చేస్తామని హామీ ఇస్తున్నారని రాంనారాయణ తెలిపారు. సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ కొంత మంది జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల పంపిణీ చేశారని, ఆయనకు యూనియన్ రాష్ట్ర కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. సుప్రీం కోర్టు తీర్పు వల్ల కొన్ని హౌస్ బిల్డింగ్ సొసైటీలకు కేటాయించిన స్థలాలు కూడా పంపిణీ కాకుండా ఆగాయన్నారు. అయితే, ఇతర జిల్లాల్లో ఏ విధంగా ఇళ్లస్థలాలు కేటాయిస్తున్నారో ఖమ్మం జిల్లాలో కూడా అదే విధంగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే విధంగా కృషి చేస్తామని చెప్పారు. ఖమ్మం జిల్లా టీయూడబ్ల్యూజే మహాసభలు వైరాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు వైరా జర్నలిస్టులు ముందుకు రావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. మహాసభల నిర్వహణకు ఏ విధంగా కార్యాచరణ తయారు చేసుకోవాలి, ఏ విధంగా ముందుకు వెళ్లాలనే అంశాలను ఆయన వైరా జర్నలిస్టులకు వివరించారు.

రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు తీసుకొని తొలిసారిగా వైరా వచ్చిన రాం నారాయణను వైరా డివిజన్ జర్నలిస్టులు ఘనంగా సన్మానించారు. అదే విధంగా జిల్లా అధ్యక్షులు వనం వెంకటేశ్వర్లును సత్కరించారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షులు వనం వెంకటేశ్వర్లుతో పాటు ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర నాయకులు నర్వనేని వెంకట్రావు, జిల్లా ఉపాధ్యక్షులు మొహిద్దిన్, జిల్లా కమిటీ సభ్యులు దాసరి శ్రీనివాసరావు, ఎం . బాబురావు, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా కమిటీ సభ్యులు ఎక్కిరాల శ్రీనివాసరావు, ఖమ్మం నగర కార్యదర్శి చెరుకుపల్లి శ్రీనివాసరావు, జిల్లా నాయకులు ఏలూరు వేణు గోపాల్, జనార్ధనా చారి, కళ్యాణ్, వైరా జర్నలిస్టులు సూతకాని శ్రీకాంత్, గద్వాల రవీందర్ సయ్యద్ అతావుల్లా, హరి బాబు, లక్ష్మణా చారి, సామినేని శ్రీనివాస రావు, మురళి, ప్రశాంత్, ఎం శ్రీనివాసరావు, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

కాంగ్రెస్ గూటికి వైరా జెడ్పీటీసీ, ఎంపీపీ

Ram Narayana

నేను గుత్తేదారును కాను …నువ్వు గుత్తేదారుకాక గాడిదపాళ్ళుతోముతున్నావా..పోంగులేటిపై కందాల ఫైర్

Ram Narayana

ఖ‌మ్మం ప‌త్తి మార్కెట్‌లో భారీ అగ్నిప్ర‌మాదం

Ram Narayana

Leave a Comment