ఖమ్మం కాంగ్రెస్ లో లొల్లి …ముగ్గురు మంత్రుల సమక్షంలోనే వాదులాట
రేణుక చౌదరి ప్రసంగాన్ని అడ్డుకున్న కార్యకర్తలు
పదవులు కావాలి మీటింగ్ లకు రారన్న రేణుకా మాటలపై భగ్గుమన్న కార్యకర్తలు
మంత్రుల జోక్యంతో సర్దుమణిగిన వివాదం …
అసలే కాంగ్రెస్ …వారి మీటింగ్ లో ఆమజా రాకపోతే ఎలా అనుకున్నారేమో ఏమో మంగళవారం
ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన ఎన్నికల సమావేశానికి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క , మంత్రులు తుమ్మల నాగేశ్వరావు , పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ,రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి హాజరైయ్యారు …ఇంతమంది ఒకేసారి కార్యాలయానికి రావడాన్ని చూసి కార్యకర్హలు సంతోషించారు …ముందుగా రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి మాట్లాడుతూ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత గురించి వివరించారు …అదే సందర్భంలో పార్టీలో పదవులు కావాలనే వారు చాలామంది మీటింగ్ కు రాలేదని అందటంతో కొంటారు ఆమె మాటలకూ అభ్యంతరం చెప్పారు …దీంతో రేణుకా అనుయాయులు సైతం వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు …ఈ సందర్భంగా వేదికపై ఉన్న ముగ్గురు మంత్రులు జరుగుతున్న పరిణామాలు చూసి అవాక్కు అయ్యారు …అసలే ఎన్నికలు అందరం ఐక్యంగా పార్టీ నిర్ణయించిన అభ్యర్థిని గెలిపించాలని వస్తే ఇదేమి వ్యవహారం అంటూ నోచుకున్నారు…మంత్రులు పొంగులేటి , తుమ్మల లేచి గొడవపడుతున్న ఇరువర్గాలను శాంత పరిచే ప్రయత్నం చేశారు …పొంగులేటి రెండు చేతులు ఎత్తి దండం పెట్టారు …సీనియర్ మంత్రి తుమ్మల సైతం లేచి ఆగమన్నారు …భట్టి సైతం గొడవ వద్దని సైగ చేశారు . చివరకు మంత్రుల అందరు కార్యకర్తలను సముదాయించడంతో గొడవ సర్దుమణిగింది …
గతంలో టీడీపీ లో చాలాకాలం పనిచేసిన మంత్రి తుమ్మల తన కనుసైగలతో కార్యకర్తలను కాంట్రొల్ చేశారు …కాంగ్రెస్ లో ప్రజాస్వామ్యం అధికంగా ఉండటంతో గొడవలు మాములే అంటున్నారు ..కార్యకర్తలు …..అదే తమ బలం అంటున్నారు మరి కొందరు …దటీస్ కాంగ్రెస్ …మరిన్ని గొడవలు జరుగుతాయో చూద్దాం …!